రాజ్యసభ ఎన్నికలు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు వీరే

By narsimha lode  |  First Published Feb 8, 2024, 1:43 PM IST

రాజ్యసభ ఎన్నికలకు  వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ  సిద్దం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను  ఆ పార్టీ ప్రకటించింది.  తెలుగు దేశం పార్టీ కూడ త్వరలోనే  తమ అభ్యర్ధి పేరును ప్రకటించనుంది.



అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ముగ్గురి పేర్లను  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) గురువారంనాడు ప్రకటించింది.  వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. రాజ్యసభ పోలింగ్ కు  తమను ఎంపిక చేయడంతో ఈ ము్గురు అభ్యర్థులు సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.  అయితే  ఈ నెల  27న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురు అభ్యర్థులు  రాజ్యసభ నుండి రిటైర్ కానున్నారు.దీంతో  మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.   టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్,  వైఎస్ఆర్‌సీపీకి చెందిన  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిటైర్ కానున్నారు.  రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని  తెలుగు దేశం పార్టీ భావిస్తుంది.  తెలుగు దేశం పార్టీ తరపున  కంభంపాటి రామ్మోహన్ రావు  బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 

Latest Videos

undefined

also read:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024: 2014 నాటి కూటమి తెరమీదికి వస్తుందా?

టిక్కెట్లు దక్కని  వైఎస్ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలపై టీడీపీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.  తమ పార్టీతో  వైఎస్ఆర్సీపీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యే లు  40 నుండి  50 మంది వరకు టచ్ లో ఉన్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

also read:కోడికత్తి కేసు:నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

2023లో జరిగిన  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ  అభ్యర్ధిని బరిలోకి దింపి విజయం సాధించింది.  వైఎస్ఆర్‌సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు  టీడీపీ అభ్యర్ధికి  ఓటేశారనే నెపంతో  ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్‌సీపీ సస్పెండ్ చేసింది. 
 

click me!