నాలుగేళ్లకో పెళ్లి: మ్యారేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు

By narsimha lodeFirst Published Dec 29, 2023, 1:20 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  తీవ్ర విమర్శలు చేశారు.

భీమవరం: నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడు ఈ మ్యారేజీ స్టార్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో   జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల చేశారు. ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో   జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు  ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.

మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను ఆటవస్తువుగా చూస్తారని  పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం విమర్శలు చేశారు.  రియల్ లైఫ్ లో  ఏ భార్యతో కూడ మూడు నాలుగేళ్లైనా కలిసి ఉండడని చెప్పారు. ఇప్పటికే  ముగ్గురు భార్యలను మార్చారని పవన్ కళ్యాణ్ పై  మండిపడ్డారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

భార్యలతో మూడేళ్లు ఉండడు, కానీ, చంద్రబాబుతో  15 ఏళ్లు బంధం ఉండాలని అంటున్నాడని  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
 దత్తపుత్రుడికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే... సీట్లు ఇవ్వకున్నా ఓకే అని ఆయన  చెప్పారు.

ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను చూసుండమన్నారు.వివాహ బంధాన్ని పవన్ కళ్యాణ్ గౌరవించాడా అని  ప్రశ్నించారు.ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు.

also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్‌ చేతికి అస్త్రం కానుందా?

దత్తపుత్రుడిని  భీమవరంలో  ప్రజలు తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.  దత్తపుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందన్నారు. వేరేవాళ్లు సీఎం కావాలని పార్టీ పెట్టినవాడు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ లేరని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ జీవితమన్నారు.దత్త పుత్రుడు త్యాగాల రాజు అని ఆయన చెప్పారు.ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను చూసుండమని జగన్  విమర్శించారు. కార్లను మార్చినట్టుగా మూడు నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడన్నారు. వివాహ సంప్రదాయాన్ని మంటగలిపారని  చెప్పారు. నాలుగేళ్లకు  పెళ్లిళ్లు  చేసుకోవడం  ఆ తర్వాత విడాకులు తీసుకోవడం  పవన్ కు అలవాటని   జగన్ విమర్శించారు. వివాహ వ్యవస్థను పవన్ కళ్యాణ్ నాశనం చేశారన్నారు. 

ఇలాంటి వాళ్లు సీఎం అయితే ఆడబిడ్డల పరిస్థితి ఏమిటని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటని  జగన్ అడిగారు.

 

click me!