ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడతారా? అసంతృప్తి వెనుక అంతర్యమేమిటి?

Published : Dec 29, 2023, 10:42 AM IST
ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడతారా? అసంతృప్తి వెనుక అంతర్యమేమిటి?

సారాంశం

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండే కేపీ సారథి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గంలో  కేపీ సారథి మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆయనకు భంగపాటే ఎదురయ్యింది. రెండవసారైనా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ అది కూడా నిరాశే అయ్యింది. 

అమరావతి : వైసీపీలో మార్పులు దెబ్బ కొడుతున్నాయా? అంటే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. యేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు మార్పులు, చేర్పులతో మనస్తాపం చెంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ సారథిపెనమలూరులో జరిగిన వైసీపీ సాధికార బస్సు యాత్రలో సీఎం జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పార్థసారథి పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలను తనను ఆశీర్వదిస్తున్నా సీఎం జగన్ మాత్రం తనను గుర్తించడం లేదని నిండు సభలో కేపీ సారథి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పని చేస్తానన్నారు. 

ఇసుకలో కూరుకుపోయిన 300 యేళ్లనాటి శివాలయం.. గ్రామస్తులు ఎలా వెలికితీశారంటే..

అయితే  కేపీ సారథి అసంతృప్తి ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండే కేపీ సారథి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గంలో  కేపీ సారథి మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆయనకు భంగపాటే ఎదురయ్యింది. రెండవసారైనా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ అది కూడా నిరాశే అయ్యింది. 

దీంతో వైసీపీ అధిష్టానం పట్ల కేపీ సారథి అప్పటినుంచే కొంత అసంతృప్తితో ఉంటున్నారు. దీంతో గురువారం జరిగిన బస్సు యాత్రలో బహిరంగంగా సీఎం జగన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేపీ సారథి త్వరలోనే వైసీపీ నుంచి బైటికి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్తులో కేపీ సారథి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే