ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.
అమరావతి: ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నుండి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. ఔట్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.ఈ ఏడాది ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఔటాన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు. ఎన్నికలయ్యాక ఏర్పడిన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.
ఎన్నికలు జరిగే సంవత్సరంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.ఎన్నికలు జరగడానికి ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి తీసుకుంటారు. ఇందుకు అసెంబ్లీ ఆమోదం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు జరిగే సమయంలో ఇదే సంప్రదాయాలను పాటించాల్సిందే.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఇవే.ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, జనసేనలు విమర్శలు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేయనున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేయనుంది. ఎన్నికల కోసం క్యాడర్ ను సన్నద్దం చేసేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దం పేరుతో సభలను నిర్వహిస్తుంది. రా కదలి రా పేరుతో చంద్రబాబు ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సభలు నిర్వహిస్తున్నారు.