ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఆశావాహుల నుండి కాంగ్రెస్ ధరఖాస్తుల స్వీకరణ

By narsimha lode  |  First Published Jan 23, 2024, 5:42 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను స్వీకరించనుంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేసే  అభ్యర్థుల నుండి  ధరఖాస్తులను  కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఈ నెల  24 నుండి ఆశావాహుల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల నుండి  ధరఖాస్తులను స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల  24 నుండి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  మాణిక్యం ఠాగూర్  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి ధరఖాస్తును  ఠాగూర్ రేపు స్వీకరించనున్నారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలోని  175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని  ఈ నెల  21న  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా  తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని  షర్మిల పిలుపు నిచ్చారు.  ఇవాళ్టి నుండి షర్మిల జిల్లాల పర్యటనలు ప్రారంభించారు.  జిల్లాల్లో విస్తృతంగా ఆమె పర్యటించనున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో  వై.ఎస్. షర్మిల పర్యటన ప్రారంభించారు.

ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు కొందరు తమతో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు  బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.  అయితే  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి  వైఎస్ఆర్‌సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

also read:రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో చంద్రబాబు అభిమానులు: షర్మిలపై జగన్ పరోక్ష విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2014 ఎన్నికల నుండి  కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింది. రాష్ట్ర విభజన జరిగి  10 ఏళ్లు కావొస్తుంది. దీంతో  ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అయితే  తెలంగాణ,  కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  దీంతో  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 

also read:సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీల మార్పు: వైఎస్ఆర్‌సీపీ ఐదో జాబితాపై కసరత్తు

వై.ఎస్. షర్మిల ఈ నెల  4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా  వై.ఎస్. షర్మిలను  కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నెల 21న వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల బాధ్యతలు కసరత్తు చేస్తున్నారు.

వైఎస్ఆర్‌సీపీతో పాటు ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై  కూడ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో  కనీసం  15 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ  ముందుకు సాగుతుంది.

click me!