Latest Videos

సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీల మార్పు: వైఎస్ఆర్‌సీపీ ఐదో జాబితాపై కసరత్తు

By narsimha lodeFirst Published Jan 23, 2024, 5:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పు కోసం వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పు  విషయంలో  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)  కసరత్తు చేస్తుంది. ఇప్పటికే  వైఎస్ఆర్‌సీపీ నాలుగు జాబితాలను విడుదల చేసింది.  ఐదో జాబితా కోసం  వైఎస్ఆర్‌సీపీ  కసరత్తు కొనసాగుతుంది.

మంగళవారంనాడు పలువురు ప్రజా ప్రతినిధులు  తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి  చేరుకున్నారు.  ఉరవకొండలో డ్వాక్రా మహిళలకు  జగన్ నిధులను విడుదల చేశారు.ఈ కార్యక్రమం నుండి ఇవాళ సాయంత్రానికి  జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. 

ఇప్పటికే నాలుగు విడతలుగా  10 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేలను మార్చింది వైఎస్ఆర్‌సీపీ. ఇంకా  మరికొందరిని మార్చేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. 

ఇవాళ పలువురు వైఎస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.  సీఎంఓలో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజా ప్రతినిధులు కూడ ఉన్నారు. మరో వైపు ఆయా జిల్లాల్లో  సిట్టింగ్  మార్పుల విషయంలో  ప్రజా ప్రతినిధులతో చర్చించేందుకు మరికొందరిని పిలిచి ఉండవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇవాళ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన  ప్రజా ప్రతినిధులను సీట్ల మార్పు కోసం వచ్చిన వారిగా పరిగణించలేం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం  సాగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో  రాష్ట్రంలోని  175  అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ  కసరత్తు చేస్తుంది. 

రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు,  పార్లమెంట్ నియోజకవర్గాల్లో  ఎవరిని బరిలోకి దింపితే రాజకీయంగా తమకు ప్రయోజనంగా ఉంటుందనే విషయమై సర్వే ఆధారంగా  మార్పులు చేర్పులను  చేస్తుంది వైఎస్ఆర్‌సీపీ.

also read:వైఎస్ఆర్‌సీపీకి నరసరావుపేట ఎంపీ షాక్: పార్టీకి, ఎంపీ పదవికి లావు కృష్ణ దేవరాయలు రాజీనామా

అయితే సీట్లు దక్కని  నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు  టిక్కెట్లు దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా  నర్సరావుపేట ఎంపీ  లావు కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే  కర్నూల్ ఎంపీ  సంజీవ్ కుమార్, మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.  మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరనున్నారు.   సీట్లు దక్కని ఎమ్మెల్యేలు కూడ పార్టీ నాయకత్వంపై  విమర్శలు చేస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారంతా  విమర్శలు చేయడం పరిపాటేనని  నేతలు వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం గుర్తు చేస్తుంది.


 

click me!