
AP Assembly Election Results 2024: తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జెఎస్‌పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కూడిన కూటమి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో అఖండ విజయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఘోర పరాజయం చవిచూసింది. 135 స్థానాల్లో విజయంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీడీపీ, రెండో స్థానంలో ఉన్న జనసేన 21 స్థానాల్లో విజయం సాధించింది. అధికార వైకాపా కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో రాష్ట్రంలో మూడవ అతిపెద్ద పార్టీగా దిగజారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచింది వీరే
| క్ర.సం. | నియోజకవర్గం | అభ్యర్థి | మొత్తం ఓట్లు | మార్జిన్ |
| 1 | అరకు | రేగం మత్యలింగం | 65658 | 31877 |
| 2 | పాడేరు | మత్స్యరాస విశ్వేశ్వర రాజు | 68170 | 19338 |
| 3 | యర్రగొండపాలెం (SC) | చంద్ర శేఖర్ తాటిపర్తి | 91741 | 5200 |
| 4 | దర్శి | బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి | 101889 | 2456 |
| 5 | బద్వేల్ | దాసరి సుధ | 90410 | 18567 |
| 6 | రాజంపేట | ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి | 92609 | 7016 |
| 7 | పులివెందుల | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి | 116315 | 61687 |
| 8 | మంత్రాలయం | వై. బాలనాగి రెడ్డి | 87662 | 12805 |
| 9 | ఆలూరు | బి. విరూపాక్షి | 100264 | 2831 |
| 10 | తంబళ్లపల్లె | పి. ద్వారకనాథ రెడ్డి | 94136 | 10103 |
| 11 | పుంగనూరు | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | 100793 | 6095 |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 : టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 : జనసేన నుంచి గెలిచిన అభ్యర్థులు వీరే