Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్లీన్‌స్వీప్ చేస్తూ.. అధికార వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీని కైవసం చేసుకున్నారు. తన సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. పవన్ కళ్యాణ్ గెలవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిచారు. తన ఫ్యాన్స్ కలని నెరవేరుస్తూ వైసిపి అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్నట్లు..2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు సింహం కంటే గట్టిగా గర్జించారు. గెలిచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే.. గత ఎన్నికల్లో గెలవ లేకపోయినా పవన్ కళ్యాణ్ ఈసారి గెలవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం..
ప్రణాళికబద్దమైన ప్రచారం
2019లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో ఓడిపోవడానికి ప్రధానం కారణం ప్రచారం సరిగ్గా చేయలేకపోవడం. ఆ సమయంలో ఆయనే మొత్తం క్యాంపెనింగ్ బాధ్యతలు చూసుకునే వారు. వన్ మాన్ షో లాగా తన పార్టీ పోటీ చేసి అన్ని స్థానాల్లో తానే ప్రచారం చేశారు. దీనివల్ల భీమవరం, గాజువాక మీద స్పెషల్ గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ కాంపెనింగ్ చేయలేకపోయారు. కానీ ఈసారి పరిస్థితి లేదు. టీడీపీ,బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తాను, తన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించారు.
నియోజక వర్గంపై స్పెషల్ ఫోకస్
2019తో పోలిస్తే.. 2024లో పార్టీ కొంచం డెవలప్ అయింది. అలాగే.. క్యాడర్ పెరిగింది. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అవసరం లేకుండానే క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అలాగే.. గతంలో లాగా కాకుండా ఈసారి ఒక్కటే నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ కి కావలసినంత టైం దొరికింది. దీంతో పిఠాపురం మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారనే చెప్పాలి.
గ్రౌండ్ లెవల్ లో ప్రజలతో మమేకమతూ.. వారి కష్టా నష్టాలను తెలుసుకొని, తాను గెలిస్తే.. వాళ్ళ కష్టాలను దూరం చేస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎలాంటి హామీలిచ్చినా.. కేవలం పిఠాపురం ని దృష్టిలో పెట్టుకొని చేయలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ని దృష్టిలో పెట్టుకొని చేశారు జగన్ చేసే పాలన్నీ పడగొట్టాలని ఎలక్షన్స్ లోకి దిగిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలందరిని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇచ్చారు. వైసీపీని దించి కూటమిని పవర్ లోకి తీసుకొని వస్తే కూటమి ఇచ్చిన ప్రతి హామీకి తాను బాధ్యత వహించి ప్రతి హామీ నేరవేర్చుతానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు.
క్షేత్ర స్థాయిలో
పిఠాపురం ప్రజలు ఎప్పటి నుంచో నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అలాగే.. వరదలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పడే కష్టాలు, ఆ సమయంలో మత్స్యకారులు తమ ఇళ్ళని కోల్పోవడం లాంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకొని తాను అధికారంలోకి వస్తే.. వీటన్నిటిని దూరం చేస్తానని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని మాటిచ్చారు. దాంతో పిఠాపురం ప్రజలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కు అందించారు.
2019 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయారు. అయితే ఈసారి తన సొంత కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి ఆయన పోటీ చేశారు. పిఠాపురం గురించి చెప్పాలంటే.. ఇది న్యూట్రల్ నియోజకవర్గం అంటే.. ఇక్కడ ప్రజలు కేవలం ఒక పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయరు. 1952 ఎలక్షన్స్ మొదలు ఇప్పటి వరకు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలను గెలిపించారు. ప్రతి పార్టీకి అధికారం అందించారు పిఠాపురం ప్రజలు. పలు సందర్భాల్లో ఇండిపెండెంట్స్ అభ్యర్థులను కూడా గెలిపించిన సందర్భాలున్నాయి. 2009లో కూడా ప్రజారాజ్యం తరుపున పోటీ చేస్తున్న వంగా గీతని గెలిపించారు. అలాగే ఈ సారి ఆ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టారు.
అధికార పార్టీపై వ్యతిరేకత
వైసీపీ పార్టీపై ఉన్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ విజయానికి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. 2019లో వైఎస్ఆర్ సీపీ తరుపున పోటీ చేసి గెలిచిన పెండ్యం దొరబాబుకి ఈ సారి సీట్ ఇవ్వకుండా వంగా గీత వైపు మొగ్గు చూపారు. వాస్తవానికి వైసిపి ప్రభుత్వం పిఠాపురంలోని లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ ఇచ్చిన హామీని వైసిపి గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు. దాంతో అక్కడ ప్రజలు వైసిపి,ఎమ్మెల్యే దొరబాబు సంతృప్తితో ఉన్నారు. అందుకే ఈసారి దొరబాబుకి టికెట్ ఇవ్వకుండా మరో కాపు నేత, సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీతని బరిలోకి దించింది వైసీపీ. అయితే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ముందు వంగా గీత హావా ఏ మాత్రం పనిచేయలేదు. ప్రధానంగా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత చూపుతూ పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని తన ప్రచారంలో ఉపయోగించారు.
కూటమి ఏర్పాటు
ఈ ఎన్నికల్లో బీజేపీ- జనసేన- టీడిపీ లు అంతా కలిసి కూటమిగా పోటీ చేయడం కూడా కలిసోచ్చిందనే చెప్పాలి. వాస్తవానికి ఈ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ ఒక కారణం. కానీ, పిఠాపురంలో ఆయన గెలుపులో కూటమి కీలక పాత్ర పోయింది. ఒకసారి 2014 ఎలక్షన్స్ గమనిస్తే ఆ ఎలక్షన్స్ లో గెలిచిన వైసిపి కాండేట్ పెండెం దొరబాబుకి 83,459 ఓట్లు, టిడిపి క్యాండిడేట్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మకి 68,467 ఓట్లు, జనసేన అభ్యర్థి మాకినీరు శేషు కుమారికి 18,011 ఓట్లు వచ్చాయి. అంటే.. టిడిపి , జనసేన ఓట్లు కంబైన్ చేస్తే వైసిపి కంటే ఎక్కువ. ఈసారి కలిసి పోటీ చేయటం వల్ల టిడిపి జనసేన ఓటు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ కి పడ్డాయని చెప్పాలి.
పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర
నిజానికి పిఠాపురంలో టిడిపి కాండేట్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీ చేయాలి. వర్మకు మంచి క్రేజ్ ఉంది. ఈయన మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. 2019లో పిఠాపురంలో టిడిపి తరఫున పోటీ చేసి వంగా గీత మీద అతికొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. వర్మకి 2014లో టిడిపి సీటు ఇవ్వలేదు. దాంతో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి 47,80 ఓట్ల మెజారిటీతో గెలిచి సీటు మిగతా పార్టీలకు కూడా మైండ్ పోగొట్టడం ఇండిపెండెంట్ కాండేట్ 47,80 ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే అది చాలా కష్టం. కానీ, వర్మ అది చేసి చూపించాడు. కానీ 2019 ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థి దొరబాబు పెండం మీద 1492 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక ఈసారి పిఠాపురం నుంచి టిడిపి ఎమ్మెల్యే టికెట్ తనకు వస్త్తుందని వర్మ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ, టిడిపి బిజెపి జనసేన పొత్తు వల్ల పిఠాపురం జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో వర్మతో పాటు పిఠాపురం టిడిపి సపోర్టర్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వర్మ ఫాలోవర్స్ అయితే టిడిపి పార్టీ జెండాలు తగులబెట్టి, ఆయనను ఇండిపెండెంట్గా పోటీ చేయమని కూడా కోరారు. అయితే.. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఏంట్రీ ఇచ్చారు. 2014లో టిడిపిని గెలిపించి, ఇప్పుడు కూటమి గెలవడానికి సపోర్ట్ చేస్తున్న పవన్ ను పిఠాపురంలో గెలిపించడం తమ బాధ్యతని పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసి గెలిపిస్తే.. టిడిపి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఎమ్మెల్సీ పొజిషన్ ఇస్తానని చంద్రబాబు వర్మకి ప్రామిస్ చేశారు. ఈ మాటతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పోషించాడు వర్మ.
పవన్ ఛరిస్మా
గత అనుభవాలను దృష్టి లో పెట్టుకున్నా పవన్ సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని క్లియర్ గా తెలుసుకున్నాడు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని.. టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఎలాగైనా వైఎస్ జగన్ ను గద్దె దించాలని భావించారు. ఇలా సింగిల్ ఎజెండాతో ఉన్న పవన్ తన పార్టీ సీట్లను కూడా త్యాగం చేశారు. మరోవైపు.. పవన్ ని ఓడించడం కోసం వైసీపీ భారీ ప్లాన్ నే వేసింది. పిఠాపురంలో బడా బడా నేతలను రంగంలోకి దించి.. చక్రవ్యూహం సెట్ చేసింది. కానీ పవన్ ఛరిస్మా ముందే ఇవేవి వర్కట్ కాలేవు. అలాగే.. 2014లో రెండు ప్లేసెస్ లో ఓడిపోయిన వ్యక్తిని సింపతి కూడా పెరిగింది. ఇలా ఎన్నో కారణాలు పవన్ గెలుపునకు కారణమమ్యాయి. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొంది..ఏపీ అసెంబ్లీలో కాలుపెట్టబోతున్న కొణిదల పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంటుందో ముమ్ముందు వేచి చూడాలి