అధిక ఫీజులు: విజయవాడలో 5 ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు

By narsimha lode  |  First Published Aug 26, 2020, 10:14 AM IST

ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. అనుమతులు లేకుండా కరోనా చికిత్సలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలకు దిగింది. 



అమరావతి:  ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. అనుమతులు లేకుండా కరోనా చికిత్సలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలకు దిగింది. 

ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొన్నప్పటికీ రోగుల నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. 

Latest Videos

undefined

స్వర్ణ ప్యాలెస్  కోవిడ్ సెంటర్ లో  అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది రోగులు మరణించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సెంటర్ల అనుమతుల విషయంలో విచారణ చేస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కోవిడ్ సెంటర్లను గుర్తించి ఆ సెంటర్లపై ప్రభుత్వం వేటు వేసింది. రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న స్వర్ణ హైట్స్, డాక్టర్ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి  ఎనికేపాడు లోని హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ ఆసుపత్రి వారి బెంజి సర్కిల్ లోని హోటల్ ఐరా, ఎన్ఆర్ఐ హీలింగ్ హాండ్స్ , ఆంధ్రా ఆసుపత్రి వారి సన్ సిటీ ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. 

రోగుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు  అందిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది. రోగుల నుండి పెద్ద ఎత్తున  ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ సెంటర్ల అనుమతిని రద్దు చేసింది.

click me!