ప్రశ్నిస్తే తప్పుడు కేసులా.. జైల్లో చిత్రహింసలు పెట్టారు: టీడీపీ నేత రామకృష్ణారెడ్డి ఆరోపణలు

By Siva KodatiFirst Published Mar 20, 2021, 5:34 PM IST
Highlights

కక్షసాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి . ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతిని బయటపెట్టినందుకే కక్ష సాధిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు

కక్షసాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి . ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతిని బయటపెట్టినందుకే కక్ష సాధిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నల్లమిల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా దుమారం రేపింది.

Also Read:బావ హత్య కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్టు

అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.

దీంతో శనివారం ఆయన రాజమహేంద్రవరం కారాగారం నుంచి విడుదలయ్యారు. తనకు మెరుగైన వైద్యం అందించకుండా చిత్రహింసలకు గురి చేశారని రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతారా? అని నల్లమిల్లి ప్రశ్నించారు.  

click me!