
ప్రకాశం : ప్రకాశం జిల్లాలో విషవాయువు లీక్ అయిన ఘటన కలకలం రేపింది. అమ్మెనియం గ్యాస్ లీక్ అవ్వడంతో 16 మంది కార్మికులు అస్వస్థత పాలయ్యారు. మున్నంగి సీ పుడ్స్ లో అమ్మెనియం లీక్ అయినట్టుగా గుర్తించారు. వెంటనే గుర్తించిన యాజమాన్యం వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఇంకా మగతలోనే ఉన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత వారి పరిస్థితి గురించి తెలుస్తుందని చెబుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.