కాపులకు కాపులే శత్రువులా...

First Published Mar 23, 2017, 3:20 AM IST
Highlights

కమిషన్ ముందు రామానుజయ తెలుుగుదేశం బాకా. కాపుల ఆగ్రహం,  గొడవ, సమావేశం మూసేసిన జస్టిస్ మంజునాథ

పవర్ లేని కాపులకు పవరున్న కాపులే శత్రువులేమో...

 

కాపుకార్పొరేషన్ ఛెయిర్మన్ రామానుజయ ప్రవర్తన, కాపు రిజర్వేషన్ల తీరు పట్ల ఆయన వైఖరి నిన్న అందరిని ఆశ్యర్యపరించిది.  చివరి మీటింగ్ కోసం జస్టిస్ కె ఎల్ మంజునాథ్ కమిషన్ ను నిన్న తూర్పుగోదావరి జిల్లా కొచ్చింది.

 

కమిషన్ ముందు హాజరయి, ఏ విధంగా కాపులు బిసి హోదాకు అర్హులో చెప్పాలి. కమిషన్ సంతృప్తిపడేలా సమాచారమివ్వాలి. అయితే,  రామానుజయ తీరు కాపు పోరాటానికి హాని చేసేలా ఉంది. ఇది ఎవరో అంటున్నది కాదు, అక్కడి కొచ్చినకాపు నాయకులంతా భావించారు.

 

అయితే, రామానుజయ అకస్మాత్తుగా కమిషన్ ముందు  ప్రత్యక్షమయ్యారు. ప్రజాభిప్రాయ వెల్లడించేందుకు అనుమతి పొందిన వారి జాబితాలో రామానుజయ పేరే లేదు. అయినా,సరే కమిషన్ అనుమతించింది. దీనికి బాగా వ్యతిరేకత వచ్చింది.

 

అయితే, రామానుజయ  ఎత్తుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వ భజన మొదలుపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం కాపుల అభ్యున్నతి ఎంత కష్టపడుతున్నదో వివరించడం మొదలుపెట్టారు.   కాపులకోసం బడ్జెట్ లో వేయికోట్ల రుపాలయను  ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. ఈ వాదన మొదటికే ముప్పు తెచే వాదన. కాపులఆర్థిక వెనకబాటు తనాన్ని పొగట్టేందుకు  ప్రభుత్వం ఇంత చేస్తున్నపుడు  మరి రిజర్వేషన్లు ఎందుకు అనే అభిప్రాయం బలంగా కమిషన్ సభ్యులకు కలిగేలా రామానజయ భజనచేశారు.

 

కమిషన్ కాపునాయకులు కూడా ఆర్థిక వాదననే వినిపిస్తున్నారు. సమాజిక వాదన వినింపచడమే లేదు. ఆర్థిక వాదన వల్ల కాపులు ‘ఆర్థికం’ గా వెనకబడిన వారే అనే అభిప్రాయంకల్గితే, రామానుజయ చెప్పిన వెయ్యి కోట్ల బడ్జెట్ వంటి పరిష్కారాలు. వేయి కోట్లు కాకుండా రెండు వేలు కోట్లు.

 

రామానుజయకు సరైన సమయంలో  కాపు జెఎసి నేతలు వాసిరెడ్డి ఏసుదాను, వేపకాయల  రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, ఎం మోహన్,  సంగిశెట్టి అశోక్ తదితరులు అడ్డుతగిలారు. ఇది రాజకీయ సమావేశం కాదు, కాపులు సామాజిక వెనకబాటు తనం ఎలాంటిదో కమిషన్ ముందు ఉంచకుండా తామే కాపులనే అందలం ఎక్కిస్తున్నామని చెప్పడం కాపు లక్ష్యానికి ద్రోహం చేయడమేనని వారు  ఎదురు తిరిగారు. ఆయననోరు మూయాలని డిమాండ్ చేశారు. రామానుజయ ప్రభుత్వ భజన అపకపోవడంతో కాపునేతలు ఒక్కసారి గా ఆయన మీద విరుచుకుపడ్డారు. దీనితో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. రామానుజయను బయటకు పంపించాల్సి వచ్చింది. దీనితో కమిషన్ ఛెయిర్మన్ చివరి సమావేశాన్ని మధ్యలోనే ముగించాల్సివచ్చింది.

 

ముద్రగడ అసంతృప్తి

 

కమిషన్ సమావేశాన్ని ఇలా అర్థాంతరంగా ముగించడం ఏమిటని అనంతరం  కాపు రిజర్వేషన్ పోరాటనాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. చివరి సమావేశమయినపుడు ఎక్కువ సమయం కేటాయించాలని అంటూ అర్థాంతరంతా ముగించడంలో ప్రభుత్వం కుట్ర కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు.

 

‘ చంద్రబాబు కుట్ర పన్ని కాపులు నిద్రపోకుండా చేస్తున్నారు. కాపులే ఆయన నిద్ర లేకుండా చేస్తారు. అంతవరకు విశ్రమించేది లేదు. ప్రజాభిప్రాయ సేకరణకు రామానుజయను పంపించడం పక్కా కుట్రలో భాగం,’అని ముద్రగడ అన్నారు.

 

అంతకు ముందు వైసిపి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ సామాజికంగా, విద్యాపరంగా నిజంగా వెనుక బడిన తరగతులు వారి హక్కులను పరిరక్షించాలని కోరారు.  ఆయన  కమిషన్‌కు వినతిపత్రం కూాడా సమర్పించారు. కాపులను బిసిలలో చేర్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు.

click me!