ఇక నుండి అంబేద్కర్ కోనసీమజిల్లా: జిల్లాలో144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు

By narsimha lode  |  First Published Jun 24, 2022, 3:51 PM IST

కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడంపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను  పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. 30 పోలీస్ యాక్ట్ ను కూడా అమల్లోకి తీసుకు వచ్చారు. 


అమలాపురం: Konaseema  జిల్లాకు Ambedkar కోనసీమ జిల్లాగా మార్చడంతో  జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా Police భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ AP Cabinet శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది.  ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేఁశం జరిగింది.

కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 24న కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి Viswaroop రెండు ఇళ్లకు నిప్పంటించారు. YCP  ఎమ్మెల్యే Satishఇంటికి నిప్పు పెట్టారు. తొలుత ప్రకటించినట్టుగానే కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ ఆందోళనకారులు చేసిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. 

Latest Videos

కోనసీమ జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ తరుణంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జిల్లాలో ఎలాంటి  హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ తో పాటు 30 పోలీస్ యాక్ట్ ను కూడా పోలీసులు అమల్లోకి తెచ్చారు. ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా పేరు మార్చారని సంబరాలు చేసుకొంటూ ర్యాలీలకు కానీ, జిల్లా పేరును మార్చారని నిరసనలకు అవకాశం లేదని కూడా పోలీసులు ప్రకటించారు. 

శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నించే వారిని వదిలే ప్రసక్తే లేదని కూడా పోలీసుతు తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కోనసీమ అల్లర్ల కేసులో మరో 18 మందిని ఇటీవలనే అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక మైనర్ కూడా వున్నాడు. వీరితో కలిపి కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 217కి చేరింది. వీరిలో మొత్తం ఆరుగురు మైనర్లు వున్నారు. ఈ ఘటనల్లో 268 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు 7 బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు.

also read:అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఏపీ కేబినెట్ ఆమోదం: కీలక అంశాలపై చర్చ

గతవారం ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను A-225గా సత్యరుషి,  A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.) సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 217కి చేరింది. వీరిలో మొత్తం ఆరుగురు మైనర్లు వున్నారు. ఈ ఘటనల్లో 268 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు 7 బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. 

click me!