ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 42 అంశాలకు ఆమోదం, కీలక నిర్ణయాలివే

Siva Kodati |  
Published : Jun 24, 2022, 03:45 PM ISTUpdated : Jun 24, 2022, 03:49 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 42 అంశాలకు ఆమోదం, కీలక నిర్ణయాలివే

సారాంశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. 

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు:

మూడవ విడత అమ్మఒడి పథకం అమలుకు ఆమోదం
43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు
కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు
సంక్షేమ కేలండర్‌కు మంత్రిమండలి ఆమోదం
వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఆమోదం
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 3,530 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
ఈ నెల 27న అమ్మఒడి నిధులు విడుదల
జులైలో విడుదల చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపునేస్తం, జగనన్న తోడు పథకాల 3వ విడత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ఆమోదం
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్
దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలకు ఆమోదం
వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.216 కోట్ల మంజూరు ఆమోదం
అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
జగనన్న ఎంఐజీ లే ఔట్ల అభివృద్ధి పాలసీకి ఆమోదం
 
PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu