అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఏపీ కేబినెట్ ఆమోదం: కీలక అంశాలపై చర్చ

By narsimha lode  |  First Published Jun 24, 2022, 2:47 PM IST

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జల్లాగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.



అమరావతి: konaseema జిల్లాకు Ambedkar కోనసీమ జిల్లాగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి AP Cabinet ఆమోదం తెలిపింది.  ఏపీ సీఎం YS Jagan  అధ్యక్షతన కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో సుమారు 40కి పైగా అంశాలపై కేబినెట్ లో చర్చించారు.ఇవాళ జరిగిన కేబినెట్ ఎజెండాలో కోనసీమకు అంబేద్కర్  కోనసీమ జిల్లాగా పేరు ఎజెండాను 32వ అంశంగా చేర్చారు. 

వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి నిధుల విడుదలకు, జూలైలో  అమలు చేసే జగనన్న విద్యా కానుక పథకాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త రెవిన్యూ డివిజన్లు,మండలాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరో వైపు PRC జీవోలో ఇటీవల చేసిన మార్పులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది.వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల విడుదలకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

Latest Videos

వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి కూడా ఏపీ కేబినెట్ సానుకూలంగా స్పందించింది. 35 సంస్థలకు భూ కేటాయింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సత్యసాయి జిల్లా పెనుగొండలో 63.29 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది.కడప జిల్లా వీరపనాయుడుపల్లె మండలంలో సర్వారాయుడు సాగర్ కి కమ్యూనిష్టు యోధుడు నర్రెడ్డి శివరాంరెడ్డి పేరును పెట్టేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

click me!