పుత్రరత్నం లోకేష్ విషయంలోనే ఇలా...ఇంకా వందల మందా: చంద్రబాబుపై అంబటి సెటైర్లు

By Arun Kumar PFirst Published Jun 11, 2020, 11:21 AM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. 

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. ఇటీవల టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులు వైసిపిలో చేరుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ను గుర్తుచేస్తూ ఎద్దేవా చేశారు. ''ఒక్క నాయకుడు పార్టీనే వీడితే వందమందిని తయారు చేస్తాం'' అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కాస్త ఘాటుగా స్పందించారు అంబటి రాంబాబు. 

''ఒక్కరు పార్టీ వీడితే  వంద మందిని తయారుచేస్తాం అని గొప్పలు చెబుతున్న బాబు గారు తన  పుత్రరత్నం విషయంలో ఎందుకు విఫలమౌతున్నారో చెప్పగలరా?'' అంటూ చంద్రబాబు, లోకేష్ లను ఎద్దేవా చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. 

read more   శిద్దా రాఘవులు వైసిపిలో చేరడానికి కారణమదే: వర్ల రామయ్య

ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన సీఎం ఎల్జీ పాలిమర్స్ బాధితుల సహాయార్థం 30 కోట్లు కేటాయించారని.... అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అంబటి  అన్నారు. గతంలో సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేదన్న వారే ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీబీఐ విచారణ అంటున్నారని...అసలు  సిగ్గుండే సీబీఐ విచారణను అడుగుతున్నారా?'' అని అంబటి విమర్శించారు.  

''గతంలో పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార పిచ్చి వలన 30 మంది చనిపోతే ఎంతమందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గెయిల్ లో ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎంతమందిని అరెస్ట్ చేయించారు.. ఎంత పరిహారం ఇచ్చారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ప్రాణం విలువ తెలియని వ్యక్తి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మంచి మనస్సు కనిపిస్తుంది. చంద్రబాబు కళ్ళల్లో దుర్మార్గం మోసం కనిపిస్తుంది'' అని మండిపడ్డారు.  

 విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపనీతో సీఎం జగన్ లాలూచీ పడ్డారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని...అయితే  లాలూచీ పడింది చంద్రబాబేనని అంబటి అన్నారు. ఆ కంపనీకి సింహాచలం భూములు కట్టబెట్టింది చంద్రబాబేనని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి ఇచ్చింది, విస్తరణ కు అవకాశం కల్పించింది చంద్రబాబేనని అంబటి ఆరోపించారు. 

click me!