నిమ్మగడ్డ వ్యవహారంపై ఎల్లో మీడియా అతి... దీనిపైనా సుప్రీంకోర్టుకు: అంబటి రాంబాబు

By Arun Kumar PFirst Published Jun 10, 2020, 10:14 PM IST
Highlights

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసిపి ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీం కోర్టు విచారించగా దానిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసిపి  ఎమ్మెల్యే నిమ్మగడ్డ ఆరోపించారు. 

తాడేపల్లి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసిపి ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీం కోర్టు విచారించిందని...అయితే కోర్టు ఆదేశాలను కొన్ని తెలుగు మీడియా సంస్ధలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  ఆరోపించారు. 

''నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాము. మేము వేసిన పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఇవ్వడానికి మాత్రమే సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ వైసిపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని కొన్ని టీవీ ఛానెల్స్, పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ రోజు ఏ విధమైన ఆర్డర్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. కేవలం రెండు పక్షాలు వాదన వినేందుకు రెండు వారాల సమయం మాత్రమే సుప్రీం ఇచ్చింది'' అని వివరించారు. 

''కోర్టులో ప్రొసీడింగ్ ఇవ్వక ముందు నుంచే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేశాయి. ఓ ఛానెల్ ఉదయం 9. 45 గంటల నుంచే నిమ్మగడ్డకు అనుకూలంగా, ప్రభుత్వంకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని తప్పుడు ప్రచారం చేసింది. వెబ్ సైట్ లో రాతలు రాసింది'' అని అంబటి ఆరోపించారు. 

read more    సుప్రీంలో జగన్‌కు షాక్: హైకోర్టు తీర్పుపై 'స్టే'కి నిరాకరణ

''న్యాయ స్థానాల తీర్పును వక్రీకరించి ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదకరం. రెండు వారాల తర్వాత.. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే  తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్లో మీడియా నిమ్మగడ రమేష్ కు అనుకూలంగా తీర్పు వచ్చిందని తప్పుడు వార్తలు ప్రచారం చేశాయి. సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్ ఇవ్వకుండానే నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం నేరం'' అని అన్నారు. 

''ఎల్లో మీడియా ప్రచారం చేసిన వార్తలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి.ఎల్లో మీడియానే ఇక తీర్పు చెప్పేస్తే సుప్రీంకోర్టు రెండు వారాలు తరువాత వినాల్సిన పని లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రొసీడింగ్స్ ను వక్రీకరించడం చట్ట వ్యతిరేకం. ఎల్లో మీడియా తీరుపై సుప్రీంకోర్టులో  ఫిర్యాదు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాము'' అని అంబటి వెల్లడించారు. 


 

click me!