Vijayawada: పెళ్లికి ముందే ప్రియుడితో సహజీవనం... మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Dec 13, 2021, 12:08 PM ISTUpdated : Dec 13, 2021, 12:20 PM IST
Vijayawada: పెళ్లికి ముందే ప్రియుడితో సహజీవనం... మనస్తాపంతో యువతి ఆత్మహత్య

సారాంశం

పెళ్లి కాకుండానే ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ: వారిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. మనసులు కలిసాయి కాబట్టి కలిసి జీవిస్తే తప్పేముందని అనుకున్నారో ఏమో పెళ్లి కాకుండానే సహజీవనం చేయసాగారు. ఈ క్రమంలోనే ఏమయ్యిందో తెలీదు గానీ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో కలిసుంటున్న ఇంట్లోనే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా (krishna district)లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కంచర్ల అహల్య(22) ఓ యువకుడిని ప్రేమించింది. ఈ ప్రేమ కాస్త సహజీవనానికి దారితీసింది. ప్రియుడితో కలిసి  విజయవాడ (vijayawada) రూరల్ మండలంలోని గూడవల్లిలో అహల్య నివాసముంటోంది. ఓ గదిని అద్దెకు తీసుకుని పెళ్లికి ముందే ఇలా ప్రేమికులిద్దరు సహజీవనం చేస్తున్నారు. 

మూడునెలల పాటు సాఫీగా సాగిన సహజీవనంలో ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరగడంతో అహల్య తీవ్ర ఆవేదనకు గురయ్యింది.  దీంతో సహజీవనం సాగిస్తున్న ఇంట్లోనే ప్రియుడు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అహత్య బలవన్మరణానికి పాల్పడింది. 

read more దారుణం: భార్యాభర్తల మధ్య గొడవలు... ఇద్దరు పిల్లలకి ఉరేసి, తల్లి ఆత్మహత్య

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతి మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుందన్నారు.   

ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ (hyderabad) శివారులో భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్న గొడవ ఆ కుటుంబంమొత్తాన్ని బలితీసుకుంది. రాజేంద్రనగర్ (rajendranagar) ప్రాంతంలో నివాసముండే ఇద్దరు భార్యాభర్తలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. భార్యాపిల్లలతో ఆనందంగా సాగుతున్న వారి జీవితాన్ని చిన్న చిన్న గొడవలు చిన్నాభిన్నం చేసాయి.  

భర్త గొడవపడి ఆవేశంలో ఇంట్లోంచి వెళ్లిపోవడంతో పార్వతి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణానికి ఒడిగట్టింది.  క్షణికావేశంలో ఇద్దరు పిల్లలు శ్రేయ, తన్వికి మొదట ఉరివేసి చంపి ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?