2016 : వరల్డ్ క్లాస్ అమరావతి ఎక్కడ?

Published : Dec 31, 2016, 06:14 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
2016 : వరల్డ్ క్లాస్ అమరావతి ఎక్కడ?

సారాంశం

అమరావతి 2018 నాటికి కడతామని చెప్పి, రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేసి  సరిగ్గా రెండేళ్లయింది. ఈరోజు నుంచి మూడో ఏడు మొదలవుతంది. అయినా అమరావతి పేపర్ దిగి రానంటున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డు  కొత్త రాజధాని నిర్మాణం జరగుతుందని ప్రకటించి రెండేళ్లు పూర్తయింది. 2014 డిసెంబర్ 30 వ తేదీన  మునిసిపల్ పరిపాలన శాఖ  ఒక జివొ (ఎంఎప్ 253) ని విడుదల చేసి రాజధాని ప్రాంతాన్ని  నోటిఫై చేసింది.

 

ఇందులో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలనుంచి 58 మండలాలు, కొన్నింటినిపూర్తిగా,మరికొన్నింటిని పాక్షికంగా రాజధాని ప్రాంతంలో చేరుస్తూ ఇచ్చిన జివొ ఇది.

 

రాజధాని నిర్మాణ ప్రకటనకు నేటితో రెండేళ్లు పూర్త యింది. మూడో సంవత్సరంలో ప్రవేశిస్తున్నది.

 

  ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక పడ లేదు. లక్షలాది ఇటుకలు తాత్కాలిక రాజధానుల కోసం ఖర్చయ్యాయి. హైదరాబాద్ లోతాత్కాలిక రాజధాని, విజయవాడలో ఒకటి, ఇపుడు వెలగపూడిలో శాశ్వత తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తయింది.

 

రాజధాని శంకుస్థాపనలకు  కోట్లు ఖర్చయ్యాయి.  ప్రధాని మోదీని ఆహ్వానించి మొత్తం రాజధాని శంకుస్థాపన జాతర లాగా చేశారు. ఇది జరిగి కూడా 14 నెలలయింది. డిజిటల్ బ్రిక్స్ పేరుతో తెలుగు ప్రవాసుల నుంచి కోట్లు వసూలు చేశారు. అపుడు ఎన్నిఇటుకలు విరాళమిచ్చారో రోజూ ప్రకటించారు. ఇపుడాసంగతి మాట్లాడటమే లేదు.

 

 వరల్డ్ క్లాస్ రాజధాని కట్టాలనుకున్నా, కట్టడం కాదు కదా, ఇపుడు రివ్యూలు కూడా తగ్గిపోయాయి. వ్యవహారమంతా పోలవరం చుట్టూ తిరుగుతూ ఉంది. పోలవరానికి ప్రతిపక్షాల నుంచి ఆటంకం జరగకుండా యజ్ఞాలు కూడా చేస్తున్నారు. పోలవరానికి రెండు వేల కోట్ల లోన్ వస్తే, ఇంటింటా  పండగ చేసుకోమంటున్నారు.

 

వెలగపూడికి  ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పట్లో రాజధాని నిర్మాణం వద్దునుకుంటున్నట్లు  అర్థమవుతుంది. కావాలనే జాప్యం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రాజధాని నిర్మాణానికి రూ.65 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా.  కేంద్రం రూ.2500 కోట్లు అందించిందని చెబుతున్నారు. అయినా సరే, శాశ్వత రాజధాని నిర్మాణం మొదలు కాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ మధ్య జరిగిన రాజధాని తమాషాలెన్నో...

 

ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్‌ ప్లాను అమోదించడం, అన్ని వర్గాల నుంచి వ్యతిరేక రావడం, తర్వాత రద్దు చేస్తున్నట్లు తానే ప్రకటించడం జరిగింది.స్విస్‌ఛాలెంజ్‌ టెండర్‌ను, కన్సార్టియంనూ ఏకపక్షంగా ఎంపిక చేశారని  హైకోర్టు వ్యాఖ్యనించింది. ఏలినవారు  వెనక్కళ్లిపోయారు.

 

కోర్ క్యాపిటల్ భవనాల నమూనా ఒక జపాన్ కంపెనీ ఇవ్వడం, అది చండిగడ్ కు కాపీలా గా కనిపిస్తున్నదని అనడంతో దానిని రద్దు చేయడం... తర్వాత దేశీయ డిజైనర్లను సంప్రదించండని ముఖ్యమంత్రి సలహా లివ్వడం... ఇలా అసలు అమరావతిలో ఏమి జరగుతూ ఉందో ఎవరికి అంతుబట్టకుండా 2016 గడిచిపోయింది.

 

2017 జనవరి 1 నాటి పరిస్థితి కోర్ క్యాపిటల నమూనా తయారు కాలేదు. క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ వుందో, చెల్లకుండాపోయిందో తెలియదు. స్విస్ ఛాలెంజ్ రద్దయింది.తాజా పరస్థితి ఏమిటో తెలియదు. ఏ ఒక్క నిర్మాణానికి టెండర్లు పిలవ లేని దుస్థితి. కేంద్రం ఇచ్చిన నిధులు పట్టిసీమకు, శంకుస్థాపన కోసం ఖర్చయినట్లు చెబుతున్నారు.

 

అయినా, సరే 2018 నాటికి అమరావతి పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రకటిస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతంలో ఆయనకేమయిన మంత్రదండం దొరికి ఉండాలి.

 

రాజధాని నిర్మాణానికయ్యే ఖర్చు రూ.65 వేల కోట్ల (ఇది పాతలెక్క) లో  రూ.15 వేల కోట్ల రుణంఇస్తుందని చెప్పారు.  ప్రభుత్వ సముదాయాలు, హైకోర్టు భవనాలు నిర్మించేందుకు సుమారు రూ.9000 కోట్లు ఖర్చవుతాయని దీన్నంతా కేంద్రమే భరిస్తుందని  అప్పట్లో చెప్పేవారు. మరయితే జాప్యం ఎందుకు?

 

క్యాపిట్ రీజియన్ లోని నిరుద్యోగులందరికీ ఉద్యోగమన్నారు. పొలం లేనివారికి పెన్షన్‌తోపాటు, ఇళ్లూ నిర్మించి ఇస్తామన్నారు.  సిఆర్‌డిఏ చుట్టుపక్కలున్న నందిగామ, కంచికచర్ల, గుడివాడ, గన్నవరం, తెనాలి, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, మచిలీపట్నం తదితర ప్రాంతాలను గ్రోత్‌ సెంటర్లుగా  ప్రకటించారు. వీటికి రాజధాని నుండి గ్రోత్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు.  ఇవన్నీ అట్టహాసంగా బహిరంగంగా ప్రకటించిన విషయాలు. అన్ని రికార్డులలో ఉన్నాయి.

 

 ఒక్క విషయంలో   కూడా ప్రగతి లేదు. రాజధానికి నిధులూ రాలేదు. పాన్లు లేవు. టెండర్లు లేవు.

 

రాజధాని గ్రామ కంఠం భూముల పరిష్కారమూ లేదు. రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు 13 గ్రామాల్లో లాటరీలు వేసి నెంబర్లు కేటాయించారు. వారికి ఒక్కరీకి స్థలం ఇవ్వలేదు. కనీసం స్థలం లేఅవుట్‌ కూడా వేయలేదు.

 

విజయవాడ అర్బన్ డెవెలప్ మెంట్ అధారిటీ  ఎపుడో వేసిన జోనింగ్‌ ప్లాన్లనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అయినా సరే,

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి, ప్రధాని మోడీ మరోసారి, కేంద్ర ఆర్థిక  మంత్రి అరుణ్‌జైట్లీ ముచ్చటగా మూడోసార్లు  శంకుస్థాపనలు చేశారు.

 

2016 మిగిలించింది ఈ మూడు కార్యక్రమాల శిలఫలకాలుమాత్రమే...

 

 

PREV
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu