పెళ్లికి రెండు గంటల ముందు వరుడు పరార్.. చెప్పులు బాలేవని చెప్పి...

Published : Nov 11, 2021, 11:28 AM IST
పెళ్లికి రెండు గంటల ముందు వరుడు పరార్.. చెప్పులు బాలేవని చెప్పి...

సారాంశం

8 గంటల సమయంలో వరుడు చెప్పులు సరిగా లేవు.. పామిడికి వెళ్లి మార్చుకొస్తానని ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్లిపోయాడు. marriage సమయం దగ్గర పడుతున్నా అతను తిరిగి రాలేదు.

శింగనమల : రెండు గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ మండపం  ఒక్కసారిగా మూగబోయింది. వరుడు కనిపించడం లేదంటూ కుటుంబీకులు చెప్పడంతో  అంత ఆందోళనకు గురయ్యారు.  శింగనమల మండలంలోని ఓ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని  ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిర్ణయించారు.

ఈ నెల 9వ తేదీ ముహూర్తం,  పదవ తేదీ బుధవారం 10 గంటలకు వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. brideను తీసుకుని బంధువులు మంగళవారం రాత్రికే వరుడి స్వగ్రామానికి చేరుకొన్నారు. ఉదయం tiffine ఆరగించి వధువును పెళ్లికి సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

8 గంటల సమయంలో వరుడు చెప్పులు సరిగా లేవు.. పామిడికి వెళ్లి మార్చుకొస్తానని ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్లిపోయాడు. marriage సమయం దగ్గర పడుతున్నా అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు గాలించినా ఫలితం లేకపోయింది. చిరవకు సాయంత్రం వరుడి ఆచూకీని కనుగొని గ్రామ పెద్దల వద్దకు తీసుకొచ్చారు. 

భీమవరంలో విషాదం: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి, అమ్మమ్మ సూసైడ్

అక్కడ ఈ వివాహం ఇష్టం లేదని అతడు చెప్పినట్లు సమాచారం. గ్రామపెద్దలు ఇరు కుటుంబాలతో చర్చలు జరిపి వివాహం రద్దు చేసినట్లు తెలిసింది. 

నీటి సమస్య ఉందని పెళ్లి క్యాన్సిల్...
మరో వైపు.. కర్ణాటకలో గత నెల నీటి సమస్య కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని Davanagere జిల్లాలోని హరి హర  తాలూకా  మల్లె  బెన్నూర్ గ్రామంలో Drinking water problem తీవ్రరూపం దాల్చింది. ఇటీవల గ్రామానికి చెందిన హాలేష్ అనే యువకుడికి Marital relationship కోసం భానుహళ్లికి  చెందిన యువతి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చారు.

 ఆ సమయంలో నీటి కోసం గ్రామస్తులు Fighting కనిపించింది.  ఘర్షణకు  కారణమేమిటని  గ్రామస్తులను వాకబు చేయగా.. నీటికోసం ఇలా నిత్యం పోట్లాడుకోవడం తమకు సర్వసాధారణమని చెప్పారు. ఆ మాటలు విన్న యువతి Parents ఆలోచన మొదలైంది. మల్లె  బెన్నూర్ గ్రామం లోని యువకుడితో తమ కుమార్తె వివాహం జరిపిస్తే ఆమె కూడా నిత్యం గుక్కెడు నీటి కోసం పోరాడాల్సి వస్తుందేమోనని భయపడ్డారు.

గుడికి వెళ్ళిన తర్వాత యువకుడు ఇంటికి వెళ్లాలని తీసుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.  ఆలయం నుంచి నేరుగా తాము తాము వచ్చిన దారిని వెనక్కి వెళ్లారు.  అదేమిటి అని కొందరు ప్రశ్నించగా.. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్న గ్రామంతో తాము వియ్యం అందుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పారట.

 పెళ్లి వారు వచ్చిన రోజు ఏమి జరిగిందంటే…
దాదాపు పదిహేను రోజుల తర్వాత ఆ రోజున తాగునీరు సరఫరా జరిగింది. నీటి కోసం మహిళలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. వారికి  పురుషులు కూడా సహకరించారు.  ఆ సమయంలోనే పెళ్లి వారు అక్కడికి వచ్చారు. రెండు నెలలుగా 15 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆరోపించారు. తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని వాపోయారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?