అమరావతి భూములు: ఎమ్మెల్లే ఆర్కే ఫిర్యాదు, చంద్రబాబుకు చిక్కులు

Published : Mar 16, 2021, 11:40 AM IST
అమరావతి భూములు: ఎమ్మెల్లే ఆర్కే ఫిర్యాదు, చంద్రబాబుకు చిక్కులు

సారాంశం

అమరావతి ఆసైన్డ్ భూములపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. దానిపై సీఐడి డిఎస్పీ సూర్య భాస్కర్ రావు నేతృత్వంలో విచారణ జరిగింది. ఆ తర్వాత కేసులు నమోదు చేశారు.

అమరావతి: గుంటూరు జిల్లా వంగంళగిరి శానససభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కె) అమరావతి భూములపై గత నెల 24వ తేీదన ఫిర్యాదు చేశారు. ఆ మర్నాడే దానిపై విచారణకు ఆదేశించారు. సిఐడి డీఎస్పీ సూర్యభాస్కర్ రావు నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. సూర్యభాస్కర్ రావు బృదం ఈ నెల 12వ తేదీన నివేదికను సమర్పించింది.

ఆ నివేదిక ఆధారంగా సీఐడి కేసులు నమోదు చేసింది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు వచ్చి పడ్డాయి. చంద్రబాబుపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఉండడం గమనార్హం. దానికి ప్రాతిపదిక ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదే.

సీఐడి డీఎస్పీ సూర్య భాస్కర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలోనూ రాజధాని ప్రాంతంలోనూ ఎస్సీ, ఎస్టీల భూములను బెదిరించి కుట్ర చేసి ఆక్రమించుకున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. భూములు ఇవ్వకపోతే పరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బెదిరించి ఐసైన్డ్ భూములను లాక్కున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. 

అక్రమాలు జరిగినట్లు సూర్యబాస్కర్ రావు నివేదిక సమర్పించిన రోజునే కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చంద్రబాబు మెడకు ఐసైన్డ్ భూముల వ్యవహారం చుట్టుకుంది. 

PREV
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour