తాడిపత్రిలో ఎక్స్ అఫిషయో ఓట్ల గందరగోళం... హైకోర్టును ఆశ్రయించిన టిడిపి ఎమ్మెల్సీ

By Arun Kumar PFirst Published Mar 16, 2021, 11:38 AM IST
Highlights

తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికలో తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని దీపక్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. 

అనంతపురం: ఇటీవల జరిగిన మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార వైసిపి అన్నిచోట్ల ఘన విజయం సాధించింది. అయితే ఒక్క తాడిపత్రిలో మాత్రం వైసిపికి టిడిపి గట్టిపోటీ ఇవ్వగలిగింది. అయితే ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రానందున చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోడానికి పెట్టుకున్న దరఖాస్తులను కమిషనర్ తోసి పుచ్చారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆయన అర్హత లేదని కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికలో తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని దీపక్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తాడిపత్రిలోనే ఓటు హక్కు వుంది... కాబట్టి తనను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా గుర్తించాలని దీపక్ రెడ్డి కోర్టును కోరారు. 

 తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవడానికి నలుగురు ఎమ్మెల్సీలు పెట్టుకున్న దరఖాస్తులను కమిషనర్ తిరస్కరించారు. అర్హత లేనందున వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు కమిషనర్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్సీల్లో ముగ్గురు వైసీపీకి చెందినవారు కాగా, మరొకరు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి.  

తాడిపత్రిలో మొత్తం 36 వార్డులున్నాయి. వీటిలో టీడీపీ 18 వార్జులను గెలుచుకుంది. వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. సిపిఐ ఒక చోట విజయం సాధించగా, మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇలా ఏ పార్టీకి  మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారాయి. 

మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్ -5 క్లాజ్ (3) ప్రాకరం పోలింగ్ తేదీ తర్వాత 30 రోజుల లోపు ఎక్కడో చోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. రంగయ్య తాడిపత్రిలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకుంటే వైసీపీ బలం కూడా 18కి పెరుగుతుంది. దీంతో టీడీపీ, వైసీపీ బలాలు సమానమవుతాయి. సిపిఐ అభ్యర్థి ఒక పార్టీకి, స్వతంత్ర అభ్యర్థి మరో పార్టీకి మద్దతు ఇచ్చినా బలాలు సమానవుతాయి. ఇద్దరు కూడా ఒకే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. ఇలా జరిగినా కూడా టాస్ వేయాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రహస్య ప్రాంతానికి తరలించారు తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ఆయన ఎత్తులు వేస్తున్నారు. మొత్తం మీద, మైదుకూరు, తాడిపత్రి మున్సిపాలిటీల చైర్మన్ పదవుల ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.

click me!