చంద్రబాబుపై అట్రాసిటీ కేసా... ఆ వైసిపి ఎమ్మెల్యే ఎస్సీనా? ఎస్టీనా?: అచ్చెన్న ఆగ్రహం

Arun Kumar P   | Asianet News
Published : Mar 16, 2021, 11:07 AM IST
చంద్రబాబుపై అట్రాసిటీ కేసా... ఆ వైసిపి ఎమ్మెల్యే ఎస్సీనా? ఎస్టీనా?: అచ్చెన్న ఆగ్రహం

సారాంశం

దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా? అని అచ్చెన్నాయుడు వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అమరావతి గ్రామాల్లో అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసమే ఉపయోగించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా? మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు? అని అచ్చెన్న ప్రశ్నించారు. 

''సీఎం జగన్, వైసిపి ప్రభుత్వం అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చాము. ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపు కాదా? జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారు. అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారు. దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్ ది'' అని మండిపడ్డారు.

read more   చంద్రబాబు మెడకు అమరావతి భూములు: ఏపీ సిఐడి నోటీసులు జారీ

''వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ను చేపట్టాం. ఎక్కడా సొంత ప్రయోజనాల కోసం తీసుకోలేదు. రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగింది. సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? పేదలు ఎంతో కాలం నుండి సాగుచేసుకొంటున్న అసైన్డ్ భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారు'' అని ఆరోపించారు.

''ఇడుపులపాయలో అసైన్డ్‌ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించారు. ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్‌. చెప్పారు. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా? అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చింది మీతండ్రి వైఎస్‌. కాదనగలరా? ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలిగించగలిగారు'' అని అచ్చెన్న పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu