అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 17న తిరుపతిలో సభకు ఏపీ హైకోర్టు బుధవారం నాడు అనుమతిని ఇచ్చింది. పాదయాత్రకు హైకోర్టు కూడా అనుమతిని ఇచ్చింది.
అమరావతి: పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని Tirupati లో బహిరంగ సభకు AP High court అనుమతిని లభించింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సభకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నెల 17న తిరుపతిలో సభకు అనుమతిని కోరుతూ Amaravati జేఏసీ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ సభకు అనుమతిని ఇచ్చింది హైకోర్టు.కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది.
also read:ముగియనున్న పాదయాత్ర: 17న తిరుపతిలో భారీ సభ, పోలీసుల అనుమతి కోరిన అమరావతి రైతులు
undefined
ఈ ఏడాది నవంబర్ 1న పాదయాత్రను చేపట్టారు. ఇవాళ Tirupati లో పాదయాత్ర ముగియనుంది. నిన్న,ఇవాళ రేపు రైతులు Tirumala శ్రీవారిని దర్శించుకొన్నారు.కోర్టు అనుమతితో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. పలు జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతూ తిరుపతికి చేరుకొంది. సుమారు 500 కి.మీ పాదయాత్ర సాగింది. తిరుపతిలో మూడు రాజధానులే ముద్దంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను అమరావతి జేఏసీ ప్రతినిధులు చించేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల కావాలనుకొనే వారు ధైర్యంగా బయటకు రావాలని అమరావతి జేఏసీ కోరింది.
శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో జేఏసీ నేతలు కోరారు. దీంతో బహిరంగ సభకు సంబంధించిన పూర్తివివరాలు అందించాలని చిత్తూరు ఎస్పీకి కూడా సమితి నాయకులు కోరారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్రను నిర్వహించారు.దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగింది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. పార్టీలు మద్దతు ప్రకటించాయి.