రెచ్చగొట్టి ఆరోపణలు చేయిస్తున్నారు: రెబెల్స్ పై రోజా ఫైర్

By narsimha lodeFirst Published Dec 15, 2021, 4:39 PM IST
Highlights

వైసీపీ రెబెల్స్ ను రెచ్చగొట్టి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై బురద చల్లే వారి విషయాలను బయట పెడతామన్నారు.

తిరుపతి:వైసీపీ రెబెల్స్‌ను రెచ్చగొట్టి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని  నగరి ఎమ్మెల్యే Roja ఆరోపించారు. బుధవారం నాడు Tirupatiలో ఆమె మీడియాతో మాట్లాడారు.బబతనపై వైసీపీ రెబెల్స్ చేసిన ఆరోపణలపై రోజా కౌంటర్ ఇచ్చారు.ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో తన వద్ద ఆధారాలున్నాయన్నారు. ఈ విషయాలను  సీఎం జగన్ సమక్షంలో బయటపెడతానని ఆమె చెప్పారు. రాష్ట్రమంతా ycp పాలన. ..నగరిలో tdp పాలన అంటూ ఎద్దేవా చేశారన్నారు. Nagari నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాను వ్యతిరేకించే వర్గం తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది.ముఖ్యంగా మున్సిపల్‌ మాజీ అధ్యక్షులు కేజే కుమార్‌, కేజే శాంతి దంపతులకు, ఎమ్మెల్యే  రోజా మధ్య పొసగడం లేదు.  ఎమ్మెల్యే రోజాకు తెలియకుండానే  కేజే శాంతి ఏకంగా కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని సాధించుకున్నారు. గతంలో కేజే కుమార్  ఇంట్లో జరిగిన వేడుకలకు పార్టీ కార్యకర్తలు హాజరు కావొద్దని కూడా రోజా ఆడియో సందేశం కలకలం రేపింది. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు హాజరు కావడం చర్చకు దారి తీసింది. 

also read:MLA Roja: నాలుగు గంటలుగా విమానం డోర్లు తెరవడం లేదు.. ఇండిగోపై కేసు వేస్తానని రోజా వార్నింగ్

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంలో కూడా ఎమ్మెల్యే రోజాకు, కేజే కుమార్‌ వర్గానికి నడుమ వివాదం తలెత్తడం చివరికి బీఫామ్‌ల విషయంలో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అయింది. అయితే రెబెల్స్ వర్గం కాకుండా రోజా వర్గానికి చెందిన కౌన్సిలర్లే విజయం సాధించారు.  కేజే కుమార్ వర్గంతో పాటు నియోజకవర్గానికి చెందిన  కొందరు నేతలు కూడా రోజాకు దూరమయ్యారనే ప్రచారం సాగుతుంది.  నిండ్ర మండలానికి చెందిన ముఖ్యనేత రెడ్డివారి చక్రపాణిరెడ్డి సైతం ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. ఇటీవల నిండ్ర మండల పరిషత్‌ ఎన్నికల్లో చక్రపాణిరెడ్డి వర్గం అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఎమ్మెల్యే రోజా పట్టుపట్టి ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేయించి చివరకు తను సిఫారసు చేసిన అభ్యర్థినే ఎంపీపీగా నియమించుకొన్నారు.

విజయపురం మండలంలో జనరల్‌ కేటగిరీకి చెందిన ఎంపీపీ పదవిని లక్ష్మీపతి రాజు ఆశించగా ఎమ్మెల్యే రోజా ఎస్టీ అభ్యర్థిని ఎంపీపీగా ఎంపిక చేయించారు. పుత్తూరు మండలంలో మండల, మున్సిపల్‌ ఎన్నికల్లో అమ్ములు వర్గం ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే రోజా దూరం పెట్టారు. దానికి తోడు ఆ వర్గానికి చెందిన ఐదుగురు నాయకులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మొత్తం పరిణామాలతో నగరిలో కేజే కుమార్‌, శాంతి దంపతుల వర్గం, నిండ్రలో చక్రపాణిరెడ్డి వర్గం, పుత్తూరులో అమ్ములు వర్గం, విజయపురంలో లక్ష్మీపతిరాజు వర్గం, వడమాలపేటలో మాజీ ఎంపీపీ మురళీరెడ్డి వర్గం రోజాకు దూరమయ్యారనే ప్రచారం సాగుతుంది. 

click me!