అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా

By Siva Kodati  |  First Published Sep 27, 2023, 4:36 PM IST

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్ట్ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్ట్ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15కు వాదనలు వింటామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు పూర్తి చేశారు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆయన వాదించారు. ఇవాళ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసుకోవచ్చని శ్రీరామ్ అన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. 

ALso Read: సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు పిటిషన్.. విచారణ మంగళవారానికి వాయిదా

Latest Videos

కాగా.. అమరావతి రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్, దానిని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతేడాది ఏప్రిల్ 27 సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అదే ఏడాది మే 9న పలువురిపై కేసులు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ వేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ తదితరులను కూడా సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ జారీ చేయాలంటూ నారా లోకేష్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. 

click me!