అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు: ఏపీ అసెంబ్లీలో ఇన్నర్ రింగ్ రోడ్డుపై చర్చలో మంత్రి సురేష్

By narsimha lode  |  First Published Sep 27, 2023, 4:00 PM IST


అమరావతి భూములపై  ఏపీ అసెంబ్లీలో జరిగిన  స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా స్కాం ఎలా జరిగిందో  మంత్రి సురేష్ వివరించారు. 


అమరావతి:అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు అని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ మార్పు కేసుపై  స్వల్పకాలిక చర్చ బుధవారంనాడు జరిగింది.ఈ చర్చలో మంత్రి సురేష్ పాల్గొన్నారు.మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు అని  మంత్రి  విమర్శించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  చంద్రబాబు చేసిన చేసిన పనులకు అవినీతి అనేది చాలా చిన్న పదమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అనేక మలుపులు తిరిగి కొందరి భూముల్లోకి వెళ్లిందని  మంత్రి ఆరోపించారు. 

గ్రాఫిక్స్ తో అమరావతిని అంతర్జాతీయ నగరంగా చంద్రబాబు చూపించారన్నారు. చివరకు అమరావతిలో అంతర్జాతీయ స్కాం జరిగిందని మంత్రి సురేష్ విమర్శించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను తమ ఇష్టానుసారం మార్చుకొన్నారని మంత్రి  చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కు చంద్రబాబు డైరెక్షన్ చేస్తే... ఈ వ్యవహారాలను లోకేష్ పర్యవేక్షించారని  మంత్రి ఆరోపించారు.ముగ్గురి స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్  రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చారని మంత్రి చెప్పారు.  

Latest Videos

undefined

ఒక వ్యక్తి లాభం కోసం యంత్రాంగాన్నే తప్పుదారి పట్టించారని మంత్రి తెలిపారు. చంద్రబాబు సర్కార్ హయంలో చోటు చేసుకున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని  మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.  ల్యాండ్ పూలింగ్ కు లొంగని వాళ్లని బెదిరించారన్నారు. చంద్రబాబు, నారాయణకు చెందిన భూముల చుట్టూ ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ వెళ్లేలా ప్లాన్ చేశారని మంత్రి సురేష్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో ముందే భూములు కొనుగోలు చేశారన్నారు.

also read:అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

ఆ తర్వాత ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేశారని  సురేష్ వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోనే హెరిటేజ్ , నారాయణకు భూములున్నాయన్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ విషయంలో లింగమనేని రమేష్ కు సహకరించినందుకే  చంద్రబాబుకు రమేష్ తన ఇంట్లో ఉండేందుకు అనుమతించారని రమేష్ వివరించారు. ఈ వ్యవహరంలో క్విడ్ కోప్రో జరిగిందని మంత్రి తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఏం జరిగిందనే దానిపై  మంత్రి సురేష్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. 

click me!