ఏపీకి అమరావతే ఏకైక రాజధాని.. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం: రాహుల్ గాంధీ

By Sumanth KanukulaFirst Published Oct 18, 2022, 4:20 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని అమరావతి ప్రాంత రైతులు  కలిశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని అమరావతి ప్రాంత రైతులు  కలిశారు. అమరావతి రైతులు తనను కలిసిన సందర్బంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని అన్నారు. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నానని ప్రకటించారు. అమరావతి రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామని  చెప్పారు. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. 

మరోవైపు పోలవరం నిర్వాసిత రైతులు కూడా రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్బంగా పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేస్తామని చెప్పారు. 

Latest Videos

ఇక, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఆయనకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జేడీ శీలం.. తదితర నేతు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఈ రోజు రాత్రి ఆదోని మండలం శాగి గ్రామంలో రాహుల్ బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆదోనిలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌ మీడియాతో మాట్లాడనున్నారు.

click me!