అమరావతి రైతుల సంచలన నిర్ణయం.. పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే..

By Sumanth KanukulaFirst Published Oct 22, 2022, 11:06 AM IST
Highlights

అమరాతి ఏకైక రాజధానిగా ఉండాలని పాదయాత్ర చేపట్టిన ఆ ప్రాంత రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అడ్డంకులు, పోలీసుల తీరుగా నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా అమరావతి రైతులు వెల్లండించారు.

అమరాతి ఏకైక రాజధానిగా ఉండాలని పాదయాత్ర చేపట్టిన ఆ ప్రాంత రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అడ్డంకులు, పోలీసుల తీరుగా నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా అమరావతి రైతులు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్టుగా అమరావతి జేఏసీ తెలిపింది. ఐడీ కార్డులు ఉంటేనే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు అంటున్నారని.. అయితే ఇదే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాంటే కుదదంటున్నారని రైతులు తెలిపారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. కోర్టుకు సెలవులు ఉన్నందున్న నాలుగు రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాకు చేరుకుంది. నేడు జిల్లాలోని రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది. 

Latest Videos

ఇదిలా ఉంటే.. తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో 600 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతించిన వారిని మినహాయించి ఎవరినీ అనుమతించవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రత్యర్థి వర్గానికి చెందిన ఏ వర్గానికి అయినా పాదయాత్రకు సమీపంలో ఉండకుండా అనుమతులు ఇచ్చేటపుడు చూసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకు మించి అనుమతించరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక, రైతుల పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేయాలనుకునే  వ్యక్తులు యాత్రలో చేరకుండా.. రోడ్డుకు ఇరువైపల ఉండ సంఘీభావం తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇక, వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటీ నుంచి అమరావతి ప్రాంత రైతులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు అమరావతి నుంచి తిరుపతికి తొలి విడత పాదయాత్రను పూర్తిచేశారు. గత నెల 12వ తేదీన.. రెండో విడత పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు సాగనున్నట్టుగా రైతులుతెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాల రైతులు అమరావతిలోని వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి అర్ధరాత్రి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభోత్సవానికి అధికార వైఎస్సార్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. 

అమరావతి రైతుల పాదయాత్రలో వైసీపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు పాల్గొన్ని వారి సంఘీభావాన్ని తెలుపుతున్నారు. అయితే రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా పలుచోట్ల వైసీపీ శ్రేణులు, మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే రైతులు యాత్రకు తొలుత ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. రాష్ట్రంలో అస్థిర రాజకీయ పరిస్థితుల కారణంగా యాత్ర చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న రైతుల అభ్యర్థనను తొలుత డీజీపీతిరస్కరించారు. అయితే అమరావతి రైతులు కోర్టు ఆశ్రయించారు. దీంతో అమరావతి పరిరక్షణ సమితి మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డీజీపీని ఆదేశించింది.

click me!