అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

By narsimha lode  |  First Published Jan 16, 2020, 8:47 AM IST

రాజధానిని అమరావతి నుండి తరలించకూడదని సీఆర్‌డీఏకు రైతులు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇస్తున్నారు. 



అమరావతి: రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల నుండి అభ్యంతరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీలోపుగా రైతులు తమ అభ్యంతరాలను తెలపాలని హైపవర్ కమిటీ సూచించింది. ఈ సూచన మేరకు రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి పంపుతున్నారు. 

Also read:అసెంబ్లీని రద్దు చేయండి, రాజకీయ సన్యాసం: జగన్‌కు బాబు సవాల్

Latest Videos

undefined

ఈ నెల 17వ తేదీ సాయంత్రం హైపవర్ కమిటీ సమావేశం కానుంది.ఈ  నెల 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశానికి హైపవర్ కమిటీ నివేదికను సిద్దం చేయనున్నారు.హైపవర్ కమిటీ సూచన మేరకు అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమ అభిప్రాయలను హైపవర్ కమిటీకి అందిస్తున్నారు.

Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

ఈ నెల 14వ తేదీ నుండి సీఆర్‌డీఏకు రైతులు తమ అభిప్రాయాలను అందిస్తున్నారు. రైతుల నుండి సీఆర్‌డీఏ అధికారులు తమ సలహాలు, సూచనలను రాతపూర్వకంగా తెలుపుతున్నారు. 

Also read:రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి

ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటలలోపుగా అధికారులకు రైతులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. విశాఖపట్టణానికి రాజధానిని తరలించాలనే ప్రతిపాదనను అమరావతికి చెందిన రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు సుమారు 29 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

click me!