చంద్రబాబు మెంటల్ డాక్టర్ ని కలిస్తే బెటర్ : ఎంపీ పండుల రవీంద్రబాబు

By Nagaraju penumalaFirst Published May 21, 2019, 2:46 PM IST
Highlights

వైఎస్ఆర్సీపీ 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే 30-40 ఏళ్లు పాలిస్తారని తెలిసి చంద్రబాబు వణుకుపుట్టుకుందన్నారు. మే 23 తర్వాత వచ్చే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ను మించి ఉంటాయని తెలిపారు. 

అమలాపురం : ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేత, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. 

వైసీపీ అధికారంలోకి వస్తే 30-40 ఏళ్లు పాలిస్తారని తెలిసి చంద్రబాబు వణుకుపుట్టుకుందన్నారు. మే 23 తర్వాత వచ్చే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ను మించి ఉంటాయని తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ పండుల రవీంద్రబాబు. 

తెలుగువారి గౌరవాన్ని సీఎం చంద్రబాబు దేశవస్థాయిలో పరువు తీస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో చంద్రబాబు రకరకాల వేషాలు వేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. 

ఇప్పటికే ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు, జాతీయ నాయకులను కలిసిన చంద్రబాబు చివరిగా మానసిక వైద్యుడిని కలిస్తే మంచిదని సూచించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు టీడీపీని రాజకీయాల నుంచి ఎగ్జిట్‌ అయ్యేలా చేశాయంటూ సెటైర్లు వేశారు. 2024 కల్లా టీడీపీ ముక్కలైపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు జాతీయ నేతలను డిస్ట్రబ్‌ చేస్తున్నారని పండుల రవీంద్రబాబు ఆరోపించారు. 
 

click me!