కర్నూల్‌లో దారుణం: మంచినీటి కోసం ఘర్షణల్లో ఇద్దరు మహిళల మృతి

Published : May 21, 2019, 11:48 AM IST
కర్నూల్‌లో దారుణం:  మంచినీటి కోసం ఘర్షణల్లో ఇద్దరు మహిళల మృతి

సారాంశం

కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. మంచినీటి కోసం జరిగిన ఘర్షణలో మంగళవారం నాడు పద్మావతి అనే  మహిళ మృతి చెందింది. ఈ జిల్లాలో మంచినీటి కోసం  జరిగిన  ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరుకొంది.


కర్నూల్: కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. మంచినీటి కోసం జరిగిన ఘర్షణలో మంగళవారం నాడు పద్మావతి అనే  మహిళ మృతి చెందింది. ఈ జిల్లాలో మంచినీటి కోసం  జరిగిన  ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరుకొంది.

జిల్లాలోని తుగ్గలి మండలం కదామకుంట్ల గ్రామంలో మూడు రోజులకు ఒక్కసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మంగళవారం నాడు వాటర్ ట్యాంకర్ వచ్చింది. అయితే పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్న కాలనీలో ఓ ఇంటి యజమాని వాటర్ ట్యాంక‌ర్‌ నుండి పైపు వేసుకొని నీటిని వాడుకొంటున్నారు.  

ఈ విషయమై పద్మావతి అనే మహిళ ఆ ఇంటి యజమానితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.ఇదిలా ఉంటే 15 రోజుల క్రితం కర్నూల్ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో కూడ మంచినీటి కోసం జరిగిన గొడవలో ఓ మహిళ మృత్యువాత పడింది. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu