పొత్తు ధర్మం పాటించాలి.. టీడీపీ ఏకపక్షంగా సీట్లు అనౌన్స్ చేయకూడదు - పవన్ కల్యాణ్

Published : Jan 26, 2024, 12:32 PM IST
పొత్తు ధర్మం పాటించాలి.. టీడీపీ ఏకపక్షంగా సీట్లు అనౌన్స్ చేయకూడదు  - పవన్ కల్యాణ్

సారాంశం

పొత్తు ధర్మం పాటించాలని జనసేన (jana sena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) టీడీపీ (TDP)కి సూచించారు. ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను మౌనంగా ఉంటున్నానని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట, అరుకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై తొలిసారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని, కానీ ఆ పార్టీ దానిని ఉల్లంఘించిందని అన్నారు. కాబట్టి తన పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన పార్టీ నాయకులతో మాట్లాడారు.

నా తండ్రి వైఎస్ఆర్.. మరి నేను వైఎస్ షర్మిల ఎలా కాను - ఏపీసీసీ చీఫ్

టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం తన పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి కూడా మాట్లాడిన తాను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే తాను మౌనంగా ఉంటున్నానని అన్నారు. సీనియర్ నేత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి  అలా జరుగుతూ ఉంటాయని తెలిపారు. అనుకోకుండా కొన్ని అలా జరుగుతాయని, వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 

వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. మొదటి స్పందన ఏంటంటే ?

జనసేన నేతలు ఇవన్నీ అర్దం చేసుకోవాలని కోరుతున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదనే తన కోరిక అని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తన వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు. ఏపీ చాలా కష్టాల్లో కూరుకుపోయిందని అన్నారు. 5 ఏళ్లలో జన సేన సత్తా ఎంటో ప్రభుత్వానికి చూపించామని తెలిపారు. 5 ఏళ్ల జన సేన పోరాట బలం 2024 రాజకీయ బలం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి ’.. అంటూ కేటీఆర్ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించి అన్నారో ?

ఒక దశాబ్దం పాటు జన సేన పార్టీని సమర్థవంతంగా నడిపామని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీతో కలిసి ఉన్నారని, మైనారిటీలను ఎలా చూస్తారని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానన తెలిపారు. ఎవరి మనోబావాలు దెబ్బ తిన్న కూడా  సెక్యులరిస్ట్ గా ప్రశ్నిస్తానని తెలిపారు. దోషులను పట్టుకోండి అంటే ఓ మతాన్ని మతాన్ని కించ పరిచినట్లు కాదని అన్నారు. తన భార్య క్రిస్టియన్ అని, తాను హిందువనని అన్నారు. అలా అని తాను ఒకే మతం మాత్రమే ప్రోత్సహించే వ్యక్తిని కాదని అన్నారు. తాను పరిపూర్ణ లౌకిక వాదినని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్