లాక్ డౌన్ సమయంలో పట్టుబడిన వాహనాలన్నింటిని విడుదల చేయనున్నట్లు ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
అమరావతి: లాక్‍డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలా పట్టుబడ్డ వాహనాలన్నింటిని తిరిగి అప్పగించనున్నట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
సీజ్ అయిన వాహనానికి సంబంధించిన పత్రాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాహనాలను తెచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు అదేశాలు జారీ చేశామని డిజిపి తెలిపారు. వాహన యజమానులు వెంటనే సంబంధిత పీఎస్‍ను సంప్రదించి తమ వాహనాలను తిరిగి పొందాలని డిజిపి వెల్లడించారు.
undefined
read more జగన్ ను అభిమన్యుడిలా మట్టుబెట్టాలని చూసిన విషనాగు చంద్రబాబు: విజయసాయి రెడ్డి
లాక్ డౌన్ సమయంలో పట్టుబడిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో పెట్టారు. కొన్ని వాహనాలకు జరిమానాలు కూడా విధించారు. ఇప్పుడు లాక్‌డౌన్ సడలించడంతో ఇలా పట్టుబడిన వాహనాలను తిరిగి వాహనదారులకు అప్పగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అయితే ఇలా వాహనాలను తిరిగి పొందాలనుకునే వారు ఆ వాహనాలపై ఉన్న చలానాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక తెలంగాణలో ఇలా కరోనా నిబంధనలను అతిక్రమించి లక్షల్లో వాహనాలు పట్టుబడ్డాయి. ఇలా సీజ్ చేసిన వాహనాలను తిరిగి వాహనాల యజమానులకు అప్పగించనున్నట్లు ఇప్పటికే తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తాజాగా ఏపి సర్కార్ కూడా అదే ప్రకటన చేశారు.