బిగ్ బ్రేకింగ్: ప్రత్యేకహోదాకు రాహూల్ హామీ

Published : Mar 06, 2018, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బిగ్ బ్రేకింగ్: ప్రత్యేకహోదాకు రాహూల్ హామీ

సారాంశం

ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న ఎంపిలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల గాంధి నుండి స్పష్టమైన హామీ వచ్చింది.

ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న ఎంపిలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల గాంధి నుండి స్పష్టమైన హామీ వచ్చింది. మంగళవారం తనను కలసిన ఏపి నేతలతో రాహూల్ మాట్లాడుతూ, కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టమైన హామియిచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్‌ నిర్వహించిన ఆత్మగౌరవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అందరం కలిసికట్టుగా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.రాహూల్ పిలుపుతో వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రయత్నాలకు మంచి ఊపొచ్చినట్లైంది.

రాహుల్‌ గాంధీ ఒక్క నిమిషంలోనే ప్రసంగం ముగించి వేదికపై దిగి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్‌ నాయకులు రఘువీరారెడ్డి, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నాయకుడు మధు ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు.

 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu