బిజెపికీ కాంగ్రెస్ గతే: చంద్రబాబు శాపనార్ధాలు

First Published Mar 6, 2018, 2:25 PM IST
Highlights
  • మిత్రపక్షం కాబట్టి ఏదోలే అని ఊరకుంటున్నారట.

కేంద్రప్రభుత్వంపై చంద్రబాబునాయుడు పోరాటం అయిపోయినట్లుంది. ఎందుకంటే, అసెంబ్లీ వేదికగా మంగళవారం చంద్రబాబు బిజెపికి శాపనార్ధాలు పెట్టారు. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయకుంటే ఏపిలో కాంగ్రెస్ కు పట్టిన గతే బిజెపికి కూడా తప్పదంటూ చెప్పటం గమనార్హం. మిత్రపక్షం కాబట్టి ఏదోలే అని ఊరకుంటున్నారట. లేకుండా బిజెపిపై ఇంతకన్నా ఎక్కువగానే పోరాటం చేసేవాడినంటూ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ గడ్డమీద పుట్టిన ప్రతీ ఒక్కరూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలంటూ సభలో ఉన్న బిజెపి సభ్యులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో తమ మీద అనవసరంగా మాట్లాడే బదులు రాష్ట్రానికి రావల్సిన వాటి గురించి కేంద్రంతో ఫైట్ చేయాలని హితోపదేశం పలికారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తాను మొదటి నుండి ఒకేమాట చెబుతున్నాను అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తనది మొదటి నుండి ప్రజాపక్షమే అన్నారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా తాను ముందుకుపోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేకప్యాకేజి ఇస్తామంటేనే సరే అన్నట్లు వివరించారు. కానీ ప్యాకేజి గురించి చెప్పిన కేంద్రం ఇప్పటి వరకూ అమలు చేయకపోవటం దురదృష్టమన్నారు.

సరే, చంద్రబాబు కేంద్రంపై విరుచుకుపడిన తర్వాత బిజెపి సభ్యులు ఊరుకోరు కదా? బిజెపి ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేకహోదాను కేంద్రం ఏ రాష్ట్రానికి పొడిగించలేదన్నారు. విభజన చట్టంలో లేనివాటిని కూడా కేంద్రం రాష్ట్రానికి చాలా ఇచ్చిందన్నారు. 2014-15 రెవిన్యూ లోటు భర్తీలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యత్యాసముందన్నారు.

 

click me!