YCP: ఎన్నికల ముంగిట్లో వైసీపీకి దెబ్బ.. టీడీపీలోకి జగన్ ఎమ్మెల్యేలు

Published : Dec 15, 2023, 06:54 PM IST
YCP: ఎన్నికల ముంగిట్లో వైసీపీకి దెబ్బ.. టీడీపీలోకి జగన్ ఎమ్మెల్యేలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో వైసీపీకి షాక్ తగిలింది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు టీడీపీలో చేరారు.  

YCP: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరు పార్టీలో చేరారు.

ఈ దంపతులు పెద్ద సంఖ్యలో అనుచరగణంతో టీడీపీలో చేరారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకుని పార్టీలోకి వెళ్లారు. ఈ ఎమ్మెల్యేలతోపాటు చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధా కృష్ణయ్య, మరో 6 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

Also Read: Bandi Sanjay: బండికి ఎంపీ టికెట్ వద్దు.. బీజేపీ సీనియర్ల తిరుగుబాటు.. తీర్మానం

టీడీపీ శ్రేణులు దీన్ని ఒక శుభసూచకంగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే.. వీరు ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ శ్రేణులు చర్చిస్తున్నాయి. ఈ లెక్కన వైసీపీ నుంచి టీడీపీలోకి మరిన్ని వలసలు ఉంటాయనే ఆశలో ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?