కరోనాతో కొడుకు మృతి.. ఆస్తి పంచాలంటూ కోడలు వేధింపులు, ఆత్త ఆత్మహత్య

By Siva Kodati  |  First Published May 22, 2021, 2:11 PM IST

గుంటూరులో వ్యవసాయ శాఖ ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్య  వ్యవహారం కలకలం సృష్టించింది. నగరంపాలెం సీఐ వేధింపుల వల్లే ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉమాదేవి వ్యవసాయ శాఖలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు. 

ఆమె పెద్ద కొడుకు బాజీ కిరణ్ జర్మనీలో ఉద్యోగం చేస్తున్నారు. నెల క్రితం తమ్ముడు అరుణ్ పెళ్లి కోసం గుంటూరుకు వచ్చాడు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇక అప్పటి నుంచి కిరణ్ భార్య అంజనీ కుమార్ ఆస్తి పంచాలని ఇదే విషయంపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Latest Videos

Also Read:మందలించారని తల్లిపై దాడి, తండ్రిని చంపి.. గుంతలో పాతిపెట్టే ప్రయత్నం...

అత్త, మరిది, ఆడపడుచు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై నగరంపాలెం సీఐ మల్లిఖార్జున్ రావు, కానిస్టేబుల్ మణిలు ఉమాదేవితో పాటు కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని ఆరోపిస్తున్నారు. సీఐ వేధింపుల వల్ల తమ తల్లి ఉమాదేవి ఆత్మహత్య చేసుకుందని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

click me!