వైసిపి పెద్దల కుట్ర... అడ్డుకోడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే: చంద్రబాబు

By Arun Kumar PFirst Published May 22, 2021, 1:32 PM IST
Highlights

దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు.

అమరావతి: విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం వంద రోజులకు చేరుకుంది. ఈ  సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు స్పందిస్తూ... దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. 

''కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసింది విశాఖ ఉక్కు కర్మాగారం. వెయ్యి పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోంది. అటువంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు'' అని చంద్రబాబు ఆరోపించారు. 

read more  ఆ కార్మికుల ఊపిరి తీయాలన్నదే జగన్ కుట్ర...: నారా లోకేష్ సీరియస్

''విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా?'' అని నిలదీశారు. 

''32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటై, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంది'' అని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 

click me!