నేటి నుండే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ షురూ...

Arun Kumar P   | Asianet News
Published : Jul 27, 2020, 10:40 AM ISTUpdated : Jul 27, 2020, 10:46 AM IST
నేటి నుండే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ షురూ...

సారాంశం

కరోనా కారణంగా చాలారోజులుగా మూతబడిన స్కూళ్లు సెప్టెంబర్ నుండి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 

అమరావతి: కరోనా కారణంగా చాలారోజులుగా మూతబడిన స్కూళ్లు సెప్టెంబర్ నుండి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అందుకోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ్టి(సోమవారం) నుండి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ అడ్మిషన్స్ ప్రక్రియ పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు సాగనుంది.  

అయితే విద్యార్థులు పాఠశాలలకు రాకుండానే వారి తల్లిదండ్రులు మాత్రమే వచ్చి అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేయవచ్చని విద్యాశాఖ తెలిపింది. అంతేకాకుండా పాఠశాలలో పనిచేసే టీచర్లందరు ఒకేసారి కాకుండా ప్రతి టీచర్ వారానికి ఒకసారి మాత్రమే వచ్చేలా చూసుకోవాలన్నారు. వారు కూడా బయోమెట్రిక్ ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆదేశించారు. 

read more  పసి బిడ్డలతో వ్యాపారం.. ఆ మహిళల శిశువులే టార్గెట్..

ఈ మేరకు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేశారు. దీని అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లకే కాకుండా జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు