చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన నటి దివ్యవాణి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నటి దివ్యవాణి ఖండించారు. చంద్రబాబు  అరెస్ట్‌ వార్త షాక్‌కు గురిచేసిందని చెప్పారు.

Google News Follow Us

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నటి దివ్యవాణి ఖండించారు. చంద్రబాబు  అరెస్ట్‌ వార్త షాక్‌కు గురిచేసిందని చెప్పారు. చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు ఉందని అన్నారు. లీడర్‌గా  తాను చంద్రబాబును గౌరవిస్తారని.. ఆయనను ఇలాంటి స్థితిలో చూడాల్సి రావడం బాధకరమని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం నన్ను బాధించిందని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్షకు అర్హులేనని అన్నారు. అయితే అది నిర్దారణ అయి బయటకు రాకముందే.. ఇలాంటి  చర్యలకు పాల్పడటం, తక్కువస్థాయి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ పరిణామాలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. 

చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ పునరాలోచించాలని కోరారు. ఒక మంచి విజన్ ఉన్న నేతను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు, పరిపాలన ఏపీకి అవసరమని పేర్కొన్నారు. తాను త్వరలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కూడా కలుస్తానని చెప్పారు.ఇక, గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన దివ్యవాణి.. గతేడాది పార్టీకి రాజీనామా  చేసిన సంగతి తెలసిందే. 

ఇదిలాఉంటే, సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణ విషయంలో క్లారిటీ వచ్చింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌  బుధవారం రోజున విచారణకు రానుంది. చంద్రబాబు పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. అయితే చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు పిటిషన్‌ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో ఈరోజు సాయంత్రం వెల్లడి కానుంది.