
Pawan Kalyan: ‘థర్టీ ఇయర్ ఇండస్ట్రీ’ డైలాగ్ ఫేమ్ యాక్టర్ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి పృధ్వీరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పృధ్వీరాజ్‌ను సాదరంగా ఆహ్వానించారు.
పృధ్వీరాజ్‌తోపాటు జానీ మాస్టర్ కూడా ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. కొన్నాళ్లుగా ప్రజా సమస్యలపై స్వయంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్న జానీ మాస్టర్ దాదాపు పొలిటికల్ ఎంట్రీ చాన్నాళ్ల క్రితమే ఇచ్చారు. తాజాగా జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాజకీయ ఆశావహులు కొత్తగా అరంగేట్రం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ, వైసీపీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు నాయకలు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు.