ఏలూరు యాసిడ్ దాడి ఘటన బాధితురాలు ఫ్రాన్సిక మృతి...

Published : Jun 21, 2023, 09:50 AM IST
ఏలూరు యాసిడ్ దాడి ఘటన బాధితురాలు ఫ్రాన్సిక మృతి...

సారాంశం

ఏలూరులో కలకలం రేపిన వివాహిత మీద యాసిడ్ దాడి ఘటనలో బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సిక మృతి చెందింది. గత మంగళవారం రాత్రి ఆమె మీద యాసిడ్ దాడి జరిగింది. 

ఏలూరు : గత మంగళవారం యాసిడ్ దాడికి గురైన ఎడ్ల ఫ్రాన్సిక అనే మహిళ (35) చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. డెంటల్ మెడికల్ కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ప్రాన్సిక మీద గత మంగళవారం గుర్తు తెలియని దుండగులు యాసిడ్ తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె రెండు కళ్ళు పోయాయి. బుధవారం ఉదయం ఆమె చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దుగ్గిరాల సమీపంలోని డెంటల్ మెడికల్ కాలేజీలో  ఎడ్ల ఫ్రాన్సిక రిసెప్షన్ గా పనిచేస్తుంది. ఏలూరులోని జెవిఆర్ నగర్ లో నివాసం ఉంటుంది.  ఆమె భర్త రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

ఇద్దరిదీ ప్రేమ వివాహమే.. కానీ విభేదాలు రావడంతో విడిపోయి రెండేళ్లుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. గత మంగళవారం రాత్రి డ్యూటీ అయిపోయి ఇంటికి టూ వీలర్ మీద వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి సమీపంలోనే యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫ్రాన్సిక బుధవారం ఉదయం చనిపోయింది.

పవన్‌పై వ్యాఖ్యలు .. ఇన్నాళ్లు పెద్దమనిషివని అనుకున్నా : ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో గత మంగళవారం రాత్రి దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ మీద యాసిడ్ దాటి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు అగంతకులు ఈ యాసిడ్ దాడికి పాల్పడ్డారు. డెంటల్ కాలేజ్ హాస్పిటల్ లో రిసెప్షన్ గా పనిచేస్తున్న మహిళపై ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఈ మేరకు తెలిపారు.. ఏలూరు స్థానిక జేవియర్ నగర్లో ఉంటున్న యువతి..ఎడ్ల  ఫ్రాన్సిక. ఆమె దుగ్గిరాల సమీపంలోని డెంటల్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది.

ఆమె భర్త రాజ మహేంద్రవరంలో కెమికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరిది ప్రేమ వివాహం. అయితే, పెళ్లైన కొద్ది రోజులకి విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. రెండేళ్లుగా వేరుగా ఉంటున్నారు. విడిపోయిన తర్వాత ఫ్రాన్సిక తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మంగళవారం రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత టూ వీలర్ మీద ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె ఇంటి దగ్గర్లోనే దుండగులు ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. 

ఈ దాడిలో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరుగులు తీస్తూ ఇంట్లోకి వెళ్లింది ఫ్రాన్సిక. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడితో బాధితురాలు కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏలూరులో యాసిడ్ దాడి కలకలం రేపడంతో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి ఆసుపత్రికి వచ్చి బాధితులని పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు.  ఆ తర్వాత డిఐజి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.  ఆమెకు మెరుగైన వైద్యం అందించడం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నామన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని.. వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Ganapathi Sachidanand Swamy Visits Kanaka Durga Temple Vijayawada | Devotees | Asianet News Telugu
Anam Ramanarayana Reddy Comment: సింహాచలం ప్రసాదంలో నత్త... జగన్ మనుషుల పనే | Asianet News Telugu