అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపి.. పూర్ణానంద రిమాండ్‌ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు

By Mahesh Rajamoni  |  First Published Jun 23, 2023, 3:24 PM IST

Visakhapatnam: తాను నడుపుతున్న ఆశ్రమంలో 15 ఏళ్ల అనాథ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాధువు పూర్ణానంద సరస్వతిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికదాడి చేసిన కేసులో పూర్ణానంద‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు.


Purnananda Saraswati's remand report : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట‌యిన పూర్ణానంద రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స‌ద‌రు రిపోర్ట్‌ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి వారిపై లైంగిక‌దాడి చేసేవాడు. అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఆశ్ర‌మంలో ముగ్గురు బాలిక‌లు, తొమ్మిది మంది బాలురు ఉన్నారు. బాలిక‌ల‌పై అత్యాచారం జరిగినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో వెల్లడైంద‌నీ, ఆ బాలిక‌ను వారి బంధువులు ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. అయితే, అత్యాచారం చేయ‌డం, వారు గ‌ర్భం దాల్చ‌కుండా ప‌లుమార్లు  వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చిన‌ట్టు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. 

కేసు పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

Latest Videos

undefined

 విజయవాడలో యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ వెంకోజీలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణానంద సరస్వతి తనను పలుమార్లు హింసించాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తన‌పై జ‌రుగుతున్న ఈ దారుణం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారనీ, రెండేళ్ల క్రితం అమ్మమ్మ ఆమెను ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్ణానంద సరస్వతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు అధికారి వివేకానంద తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు ఎవరూ లేకపోవడంతో ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకుని పూర్ణానంద సరస్వతి గత కొన్ని నెలలుగా ఆశ్రమంలోనే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంత‌కుముందు త్వరలోనే అతడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా, పూర్ణానంద స‌రస్వ‌తిపై పలు కేసులు ఉన్నాయనీ, భూ వివాదాల్లో కూడా ప్రమేయం ఉందని పోలీసులు తెలిపిన‌ట్టు ఎన్డీటీవీ నివేదించింది. 9.5 ఎకరాల ఆశ్రమ భూమి కూడా వివాదంలో ఉంది.

click me!