గుంటూరులో అంబేడ్కర్ విగ్రహంపై దాడి: నిమిషాల్లో నిందితుల అరెస్టు

By telugu teamFirst Published Apr 24, 2021, 9:00 AM IST
Highlights

గుంటూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు 40 నిమిషాల వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను పోలీసులు నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ నెల 23వ తేదీన చెరుకుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని గుళ్లపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలోని అబేండ్కర్ విగ్రహం పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, దాన్ని వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని చెప్పారు.

ఆ విషయం తమ దృష్టికి వెచ్చిన వెంటనే దానికి కారకులైనవారిని కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాపట్ల డీఎస్పీ శ్రీనివాస రావును అదేశించినట్లు ఆయన తెలిపారు. శ్రీనివాస రావు నేతృత్వంలోని పోలీసు బృందం దర్యాప్తు చేపట్టి నింిదుతులను 48 నిమిషాల్లోనే అరెస్టు చేసిందని ఆయన వివరించారు. 

నలుగురు నిందితుల వివరాలను కూడా ఆయన అందించారు. వారంతా రేపల్లె మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందినవారని చెప్పారు నిందితుల్లో ఒక్కరు మినహా మిగతా వారంతా మైనర్లని, అందువల్ల వారిని మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోయామని ఆయన చెప్పారు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు 

ఎవరైనా ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక, దేశ ద్రోహ చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. 

click me!