అన్నప్రాసన రోజే పరిటాల శ్రీరాంకు షాకిచ్చిన కొడుకు..!

Published : Apr 24, 2021, 07:57 AM ISTUpdated : Apr 24, 2021, 07:58 AM IST
అన్నప్రాసన రోజే పరిటాల శ్రీరాంకు షాకిచ్చిన కొడుకు..!

సారాంశం

తాజాగా.. పరిటాల శ్రీరామ్.. తన కుమారుడికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో  రవీంద్ర అందరికీ షాకిచ్చాడు.

టీడీపీ యువ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి ఆయన కుమారుడు రవీంద్ర ఊహించని షాకిచ్చాడు. అదేంటి పరిటాల శ్రీరామ్ కి ఇటీవలే కదా కొడుకు పుట్టింది.. అంతలోనే షాకివ్వడం ఏంటి అనే కదా మీ డౌట్. తాజాగా.. పరిటాల శ్రీరామ్.. తన కుమారుడికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో  రవీంద్ర అందరికీ షాకిచ్చాడు.

అన్నప్రసాన కార్యక్రమంలో రవీంద్ర కత్తి చేత పట్టుకోవడంతో తండ్రి శ్రీరామ్‌‌సహా అంతా షాకయ్యారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సమయంలో తీసిన పరిటాల శ్రీరామ్ ఫొటో వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్న ప్రాసన కార్యక్రమంలో పుస్తకాలు, డబ్బులతో పాటు అనేక వస్తువులు పెట్టినా రవీంద్ర నేరుగా కత్తిని పట్టుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామ్‌ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అంతా నవ్వుకున్నారు. ఈ విషయం తెలిసి.. టీడీపీ అభిమానులు , పరిటాల అభిమానులు సంబరపడటం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్