నెల్లూరులో శేషాద్రి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం.. గంట తరువాత తిరిగి ప్రయాణం..

Published : Mar 21, 2023, 01:35 PM IST
నెల్లూరులో శేషాద్రి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం.. గంట తరువాత తిరిగి ప్రయాణం..

సారాంశం

నెల్లూరు జిల్లాలో శేషాద్రి ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను తృటిలో ప్రమాదం తప్పింది. ఏసీ భోగిలో ‘హాట్ యాక్సిల్’ అయింది. వెంటనే సిబ్బంది ఆ భోగిని తొలగించారు. 

నెల్లూరు : శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ఏపీలోని నెల్లూరులో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ వద్ద ఏసీ కోచ్ కు ‘హాట్ యాక్సిల్’ అయింది. వెంటనే ఆ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది.. రైలు నుంచి ఆ భోగిని  తొలగించారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన  బిట్రగుంట స్టేషన్ వద్ద  తెల్లవారుజామున  మూడు గంటల సమయంలో జరిగింది. బోగీ తొలగించి.. వేరే భోగిని అటాచ్ చేసిన తర్వాత నాలుగు గంటల సమయంలోశేషాద్రి ఎక్స్ప్రెస్ తిరిగి బెంగళూరుకు బయలుదేరింది. ఇది ఏసీ బోగీ. దీంట్లోనే ప్రయాణికులను పద్మావతి ఎక్స్ప్రెస్ లో  సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?