విషాదం.. గుండెపోటుతో, కుప్పకూలి విధుల్లో ఉండగానే ఆత్మకూరు సీఐ హఠాన్మరణం..

Published : Mar 21, 2023, 12:03 PM IST
విషాదం.. గుండెపోటుతో, కుప్పకూలి విధుల్లో ఉండగానే ఆత్మకూరు సీఐ హఠాన్మరణం..

సారాంశం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఐ గుండెపోటుతో విధుల్లో ఉండగానే మరణించారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. 

నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.  ఆత్మకూరు సిఐ మల్లి నాగేశ్వరరావు (48)  సడన్గా వచ్చిన గుండెపోటుతో మృతి చెందారు. మల్లి నాగేశ్వరరావు  ఆరు నెలల క్రితమే బదిలీపై అమరావతి నుంచి ఆత్మకూరుకు  వచ్చారు. సిఐగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం విధుల్లో భాగంగా మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయంగా వెళ్లారు. అక్కడ విచారణ ముగించుకుని వచ్చారు. 

ఆ తర్వాత మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి, వచ్చారు. ఆ తరువాత  తీవ్ర గుండెపోటు వచ్చింది. నొప్పితో మెలికలు తిరుగులూ కుప్పకూలిపోయారు. కంగారుపడిన తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత నెల్లూరుకు తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆయన మృతి చెందారు. ఆయన ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. 

చెన్నై నుండి న్యూఢిల్లీకి చేరుకున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఇదిలా ఉండగా, సడన్గా గుండెపోటుకు గురై.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయి.. మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అప్పటివరకు బాగున్న వ్యక్తులు జిమ్ చేస్తూనో, సినిమా చూస్తూనో, వాకింగ్ చేస్తూనో, డ్యాన్స్ చేస్తూనో ఒక్కసారిగా కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమైనాప్పటికీ ఈ ఘటనలో తీవ్రభయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డాన్స్ చేస్తూ చేస్తూ..  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు.  

ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది.  అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్.. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్లో సురేంద్ర కుమార్ దీక్షిత్  డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా… అతనికి గుండెపోటు సడన్ గా గుండెపోటు రావడంతో.. చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్  ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

దీంతో ఆయనతోపాటు అప్పటివరకు డాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు.  అయినా ఫలితం లేకపోయింది.  ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ లోని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చి 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చి 17న జరిగింది. దాని కంటే  ముందు రోజు మార్చి 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తపాల శాఖ ఉద్యోగి అయిన  సురేంద్ర కుమార్ దీక్షిత్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి ఓ పాటకు నృత్యం చేశాడు. అలా చేస్తూనే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు. 

PREV
click me!

Recommended Stories

Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu