(వీడియో) ఏసిబికి చేతినిండా పనే..

First Published Sep 25, 2017, 3:18 PM IST
Highlights
  • ఈమధ్య కాలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసిబి)కు చేతినిండా పనే.
  • ఏ శాఖకు చెందిన అధికారుల ఇళ్ళపై దాడులు చేసినా కోట్ల కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయి.
  • తాజాగా విశాఖపట్నం, విజయవాడలోని ఇద్దరు అధికారుల ఇళ్ళపై ఏసిబి దాడులు చేస్తే కళ్ళు చెదిరే డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో పాటు ఇతరత్రా ఆస్తలు బయపడ్డాయి.
  • బయటపడ్డ ఆస్తులను చూసిన తర్వాత ఏసిబి అధికారులకే కళ్ళు తిరిగాయి.

ఈమధ్య కాలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసిబి)కు చేతినిండా పనే. ఏ శాఖకు చెందిన అధికారుల ఇళ్ళపై దాడులు చేసినా కోట్ల కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం, విజయవాడలోని ఇద్దరు అధికారుల ఇళ్ళపై ఏసిబి దాడులు చేస్తే కళ్ళు చెదిరే డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో పాటు ఇతరత్రా ఆస్తలు బయపడ్డాయి. బయటపడ్డ ఆస్తులను చూసిన తర్వాత ఏసిబి అధికారులకే కళ్ళు తిరిగాయి. విశాఖపట్నం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటరఘు ఇంట్లో ఏసిబి దాడి చేస్తే మంగళగిరి, విజయవాడ, షిర్డీ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, రాజానగరం ప్రాంతాల్లో భూములు, భవనాలు, బంగారు ఆభరణాలతో పాటు కోట్ల కొద్దీ డబ్బు దొరికాయి.

అదే సమయంలో విజయవాడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపరెండెంట్ వెంకట శివప్రసాద్ ఇంటిపై జరిగిన దాడిలో కూడా కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తులు బయటపడ్డాయి. గన్నవరం దగ్గర 300 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వాషింగ్ మెషీన్లో బంగారు ఆభరణాలు, వజ్రాలు, నోట్ల కట్టలను దాచిపెట్టటం విశేషం. అంటే దాచిపెట్టటానికి ఇంకెక్కడా చోటు లేక వాషింగ్ మెషీన్లో దాచిపెట్టారు. ప్రాధమిక సమాచారం ప్రకారమే సుమారు రూ. 300 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు లెక్కకట్టారు.

ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల్లో డబ్బు సంపాదన విషయంలో బరితెగింపు కబనడుతోంది. ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న ధైర్యమే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఏసిబి దాడుల్లో దొరికి సస్పెండైనా మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని పట్టుకుని ఉద్యోగంలోకి చేరిపోవచ్చన్న తెగింపు స్పష్టంగా కనబడుతోంది. అందుకనే అడ్డదిడ్డమైన సంపాదనకు దిగుతున్నారు. ఈ మధ్య ఏసిబికి పట్టుబడిన ఏ అధికారి విషయం చూసినా వందల కోట్ల రూపాయల ఆస్తులు పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం.

click me!