సచివాలయ ఉద్యోగులకు రవాణా అవస్థలు

First Published Sep 25, 2017, 1:52 PM IST
Highlights
  • ఏపీ సచివాలయ ఉద్యోగులకు రవాణా అవస్థలు ఇప్పట్లో తప్పేలా కనపడటం లేదు
  • తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన చేపట్టిన ఉద్యోగులు

ఏపీ సచివాలయ ఉద్యోగులకు రవాణా అవస్థలు ఇప్పట్లో తప్పేలా కనపడటం లేదు. గత సంవత్సరకాలంగా మొర పెట్టుకుంటున్నా.. తమ గోడు అధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో  సోమవారం ఉద్యోగులు తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు.

 

అసలు ఏం జరిగిందేమిటంటే..సచివాలయంలో ఉద్యోగం చేసేవారందరూ.. దాదాపు విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వస్తున్నారు.కార్యాలయానికి రావడానికి వారికి ప్రత్యేక బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆర్టీసీ బస్సులోనే రావాలి. వారు కార్యాలయానికి రవాల్సిన సమయంలో బస్సు సదుపాయం లేదు. దొరికిన బస్సు పట్టుకొని  ఆఫీసుకు  రావాలి. ఒక్కోసారి అంత కష్టపడి బస్సు పట్టుకొని ఆఫీసుకి చేరినా.. లాభం లేకుండా పోతోంది. ఎందుకంటే కార్యాలయంలో బయోమెట్రిక్ విధానం ఉంది. ఆలస్యంగా కార్యాలయానికి చేరితే.. ఆబ్సెంట్ కిందకే వస్తోంది. దీంతో తాము చాలా అవస్థలు పడాల్సి వస్తోందని గత సంవత్సరంగా సచివాలయ ఉద్యోగులు మొత్తుకుటున్నారు.

 

కొన్ని బస్సులు అయితే.. పేరుకే నాన్ స్టాప్ బస్సులని బోర్డు పెట్టుకొని.. ప్రతి స్టాపులో ఆపుతూ ఆర్డినరీ బస్సులా నడుపుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. దీని వలన కూడా తాము కార్యాలయానికి సమయానికి చేరుకోలేకపోతున్నామన్నారు.  తమ ఉద్యోగులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయమని ఆర్టీసీ ఎండిని కోరినా లాభం లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోయారు.  తమ సమస్యను పరిష్కరించే వరకు విధులు హాజరుకామంటూ ఆందోళన చేపట్టారు. తమ సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

click me!